Asianet News TeluguAsianet News Telugu

ట్రక్కులో 40 శవాలు.. టెక్సాస్ లో అంతుచిక్కని మరణాలు..

అమెరికాలోని టెక్సాస్ లో ఓ ట్రక్కులో 40 మంది మృతదేహాలు కలకలం రేపాయి. రైల్వే పట్టాల పక్కన ఉన్న ఓ ట్రాక్టర్ ట్రైలర్ ట్రక్కులో ఈ మృతదేహాలు కనిపించాయి. 

At Least 40 Found Dead Inside Truck In Texas
Author
Hyderabad, First Published Jun 28, 2022, 8:45 AM IST

యుఎస్ : టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియోలో సోమవారం ఓ ట్రాక్టర్-ట్రైలర్‌లో కనీసం 40 మంది చనిపోయి కనిపించారని లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి తెలిపారు. శాన్ ఆంటోనియోలోని స్థానిక KSAT టెలివిజన్ కథనం ప్రకారం.. ఓ ట్రక్కులో 42 మంది మరణించి ఉన్నట్లు కనుగొన్నారని రిపోర్ట్ చేశారు. 

శాన్ ఆంటోనియో నగరం దక్షిణ శివార్లలోని మారుమూల ప్రాంతంలో రైలు పట్టాల పక్కన ఈ ట్రక్కు కనిపించిందని KSAT తెలపిపింది. దీనిమీద స్పందించడానికి శాన్ ఆంటోనియో పోలీసులు వెంటనే అందుబాటులోకి రాలేదని తెలిపింది. ఇక ఈ ఘటన మీద KSAT రిపోర్టర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఫోటోలలో పెద్ద ట్రక్కు..దాని చుట్టూ పోలీసు వాహనాలు, అంబులెన్స్‌లను కనిపిస్తున్నాయి.

మెక్సికన్ సరిహద్దు నుండి 160 మైళ్ళు (250 కిమీ) దూరంలో ఉన్న శాన్ ఆంటోనియోలో ఉష్ణోగ్రతలు సోమవారం అధిక తేమతో 103 డిగ్రీల ఫారెన్‌హీట్ (39.4 డిగ్రీల సెల్సియస్) వరకు పెరిగాయి.

దక్షిణాఫ్రికాలో విషాదం.. బార్ లో 21మంది టీనేజర్లు మృతి, విషప్రయోగం అనుమానాలు...

కాగా, సోమవారం జోహన్స్ బర్గ్ లోని ఓ నైట్ క్లబ్ లో 21 మంది టీనేజర్లు ఒకేసారి మృత్యవాత పడ్డారు. వీరిలో అత్యంత పిన్నవయసు 13యేళ్లు. వీకెండ్ లో దక్షిణాఫ్రికాలోని టౌన్‌షిప్ టావెర్న్‌లో ఒక నైట్ అవుట్ తరువాత వీరంతా చనిపోయారు. అయితే మరణాలకు గల కారణాలు మాత్రం అస్పష్టంగా ఉన్నాయి. విద్యార్థులు తమ హైస్కూల్ పరీక్షలు అయిపోయిన సందర్భంగా శనివారం రాత్రి పార్టీ చేసుకుని ఉంటారని అనుమానిస్తున్నామని స్థానిక అధికారులు తెలిపారు. 

అయితే, ఈ దుర్ఘటన గురించి తెలియగానే పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. కానీ ఆశ్చర్యంగా మృతదేహాలపై ఎలాంటి గాయాలు కనిపించలేదు. తొక్కిసలాట వల్ల చనిపోయి ఉంటారేమో అనే అంశాన్ని అధికారులు తోసిపుచ్చారు. మరణాలు విషప్రయోగం వల్ల జరిగి ఉండొచ్చేమో అనే అనుమానం.. శవపరీక్షల ఫలితాలు వస్తే కానీ చెప్పలేమన్నారు.

ఘటన గురించి తెలియడంతో.. పిల్లల తల్లిదండ్రులతో సహా.. పెద్ద ఎత్తున జనం ఆదివారం తూర్పు లండన్ లో విషాదం జరిగిన క్లబ్ వెలుపల గుమిగూడారు. అయితే పోలీసులు ఎవ్వరినీ అనుమతించలేదు. మార్చురీ వాహనాలు మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం తరలించాయి. ఈ విషయం తెలియగానే సీనియర్ ప్రభుత్వ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నాయి. వీరిలో నేషనల్ పోలీసు మినిస్టర్ భేకీ సెలే కూడా ఉన్నారు. ఆయన మృతదేహాలను భద్రపరిచిన గదిని పరిశీలించిన తరువాత బయటకు వచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. 

అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ‘‘ఇది హృదయవిదారకమైన దృశ్యం. "వారంతా చాలా చిన్నవారు. వారందరికీ 13,14 సంవత్సరాలుంటాయని తెలిసినప్పుడు.. విగతజీవులుగా పడున్న వారిని చూస్తే మీ మనసు ముక్కలవుతుంది’’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. చనిపోయిన వారిలో ఎనిమిది మంది బాలికలు, 13 మంది అబ్బాయిలు ఉన్నారని తూర్పు కేప్ ప్రావిన్స్ ప్రభుత్వం తెలిపింది. నైట్ క్లబ్ లో పదిహేడు మంది చనిపోయారు. మిగిలిన వారిని ఆస్పత్రికి తరలించిన తరువాత మరణించారు.

Follow Us:
Download App:
  • android
  • ios