Asianet News TeluguAsianet News Telugu

దక్షిణాఫ్రికాలో విషాదం.. బార్ లో 21మంది టీనేజర్లు మృతి, విషప్రయోగం అనుమానాలు...

దక్షిణాఫ్రికాలోని టావెర్న్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ బార్ లో 21 మంది టీనేజర్లు అనుమానాస్పదంగా మృతి చెందారు. అయితే, మృతదేహాలపై పైకి కనిపించే గాయాలు లేవు. తొక్కిసలాట జరిగినట్టుగా అనిపించడం లేదని అధికారులు అంటున్నారు. విషప్రయోగంతో జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

21 Teenagers Dead In South Africa Bar, Cause Still Unclear
Author
Hyderabad, First Published Jun 27, 2022, 7:53 AM IST

జోహన్నెస్‌బర్గ్ : జోహన్స్ బర్గ్ లోని ఓ నైట్ క్లబ్ లో 21 మంది టీనేజర్లు ఒకేసారి మృత్యవాత పడ్డారు. వీరిలో అత్యంత పిన్నవయసు 13యేళ్లు. వీకెండ్ లో దక్షిణాఫ్రికాలోని టౌన్‌షిప్ టావెర్న్‌లో ఒక నైట్ అవుట్ తరువాత వీరంతా చనిపోయారు. అయితే మరణాలకు గల కారణాలు మాత్రం అస్పష్టంగా ఉన్నాయి. విద్యార్థులు తమ హైస్కూల్ పరీక్షలు అయిపోయిన సందర్భంగా శనివారం రాత్రి పార్టీ చేసుకుని ఉంటారని అనుమానిస్తున్నామని స్థానిక అధికారులు తెలిపారు. 

అయితే, ఈ దుర్ఘటన గురించి తెలియగానే పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. కానీ ఆశ్చర్యంగా మృతదేహాలపై ఎలాంటి గాయాలు కనిపించలేదు. తొక్కిసలాట వల్ల చనిపోయి ఉంటారేమో అనే అంశాన్ని అధికారులు తోసిపుచ్చారు. మరణాలు విషప్రయోగం వల్ల జరిగి ఉండొచ్చేమో అనే అనుమానం.. శవపరీక్షల ఫలితాలు వస్తే కానీ చెప్పలేమన్నారు.

ఘటన గురించి తెలియడంతో.. పిల్లల తల్లిదండ్రులతో సహా.. పెద్ద ఎత్తున జనం ఆదివారం తూర్పు లండన్ లో విషాదం జరిగిన క్లబ్ వెలుపల గుమిగూడారు. అయితే పోలీసులు ఎవ్వరినీ అనుమతించలేదు. మార్చురీ వాహనాలు మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం తరలించాయి. ఈ విషయం తెలియగానే సీనియర్ ప్రభుత్వ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నాయి. వీరిలో నేషనల్ పోలీసు మినిస్టర్ భేకీ సెలే కూడా ఉన్నారు. ఆయన మృతదేహాలను భద్రపరిచిన గదిని పరిశీలించిన తరువాత బయటకు వచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. 

ఆఫ్ఘన్ ప‌రిస్థితిని దారుణంగా మార్చిన భూకంపం.. అంత‌ర్జాతీయ సాయం కోరిన తాలిబ‌న్లు

అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ‘‘ఇది హృదయవిదారకమైన దృశ్యం. "వారంతా చాలా చిన్నవారు. వారందరికీ 13,14 సంవత్సరాలుంటాయని తెలిసినప్పుడు.. విగతజీవులుగా పడున్న వారిని చూస్తే మీ మనసు ముక్కలవుతుంది’’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. చనిపోయిన వారిలో ఎనిమిది మంది బాలికలు, 13 మంది అబ్బాయిలు ఉన్నారని తూర్పు కేప్ ప్రావిన్స్ ప్రభుత్వం తెలిపింది. నైట్ క్లబ్ లో పదిహేడు మంది చనిపోయారు. మిగిలిన వారిని ఆస్పత్రికి తరలించిన తరువాత మరణించారు.

టౌన్‌షిప్ టావెర్న్‌లలో 18 ఏళ్లు పైబడిన వారికి మద్యపానం అనుమతిస్తారు. వీటిని సాధారణంగా షెబీన్స్ అని పిలుస్తారు. ఇవి ఇళ్లలో కూడా ఉంటాయి. అయితే, అన్ని చోట్ల లాగే భద్రతా నిబంధనలు, మద్యపానం-దానికి తగిన వయస్సు చట్టాలు ప్రతిసారీ అమలు కావు. ‘మా కూతురు కూడా చనిపోయినవారిలో ఉంది. ఆమె సంఘటనా స్థలంలోనే మరణించింది’ అని 17 ఏళ్ల బాలిక తల్లిదండ్రులు చెప్పారు. మరో పిల్లాడి తల్లి రోధిస్తూ..‘చాలామంచిగా ఉండేవాడు, వినయంగా ఉండేవాడు.. ఇలా చనిపోతాడని ఊహించలేదు’ అంటూ విలపించింది. 

జర్మనీలో జరుగుతున్న G7 సదస్సుకు హాజరైన అధ్యక్షుడు సిరిల్ రామఫోసా  ఈ విషాదం గురించి తెలిసి తన సంతాపాన్ని తెలియజేశారు. ‘18 యేళ్ల లోపు వారు ఒక దగ్గర చేరి.. పార్టీ చేసుకోవడం.. వయసు పరిమితిని పరిగణలోకి తీసుకోకుండా అనుమతి నివ్వడం’ విషయం మీద రామఫోసా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటన తరువాత ఇప్పుడు మద్యం లైసెన్సింగ్ నిబంధనలను సవరించాలా వద్దా అని అధికారులు ఆలోచిస్తున్నారు. ఆఫ్రికాలో అత్యధికంగా మద్యం సేవించే దేశాలలో దక్షిణాఫ్రికా ఒకటి.

"ఇది జీర్ణించుకోలేని విషయం. 20 మంది యువత ఒకేసారి ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం’ అని ప్రావిన్షియల్ ప్రధాన మంత్రి ఆస్కార్ మబుయానే దిగ్భ్రాంతికి గురయ్యారు. 21యేళ్ల లోపువారికి మద్యం విక్రయించడం, అపరిమిత మద్యం వినియోగించడాన్ని ఆయన ఖండించారు. ‘ఇలా వ్యాపారం చేయడం సరికాదు. యువకులు కూడా ఇలాంటి ప్రయోగాలు చేయడం ద్వరా ప్రాణాల మీదికి తెచ్చుకోకూడదు’ అని చెప్పుకొచ్చారు. ఘటనా స్థలి అయిన రెండు అంతస్థుల ఎన్యోబెని టావెర్న్ బయట.. ఖాళీ మద్యం సీసాలు, విగ్గులు, పాస్టెల్ పర్పుల్ "హ్యాపీ బర్త్ డే" అని రాసిన చీరలు కూడా కనిపించాయని తెల్లవారుజామున సంఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా అధికారి ఉనాతి బింకోస్ చెప్పుకొచ్చారు. 

గాయాలు లేవు.. 
మరణాలకు తొక్కిసలాట కారణమా.. అనే అనుమానాన్ని తోసిపుచ్చుతూ.. వారి శరీరాలపై అసలు బైటికి ఎలాంటి గాయాలు కనిపించడం లేదు అన్నారు. మరణాల అంతు తెలుసుకోవడానికి మృతదేహాలను ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించిన తరువాత విషయం తెలుస్తుందన్నారు. ఏదైనా విషప్రయోగం జరిగిందా అని పరీక్షిస్తారు... అని అన్నారు. ఈ సమయంలో బార్ కిక్కిరిసి ఉంది. స్థానిక వార్తాపత్రిక డిస్పాచ్‌లైవ్ తన వెబ్‌సైట్‌లో "శరీరాలు టేబుల్‌లు, కుర్చీలు, నేలపై ఎక్కడపడితే అక్కడ పడి ఉన్నాయి, శరీరాలపై గాయాల ఆనవాళ్లు లేవు’  యొక్క స్పష్టమైన సంకేతాలు లేవు" అని రాసింది. చనిపోయిన వారిలో చాలా మంది విద్యార్థులు హైస్కూల్ పరీక్షలు ముగిసిన తర్వాత "పెన్సు డౌన్" పార్టీలు జరుపుకుంటున్నారని తల్లిదండ్రులు, అధికారులు చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios