వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ ఘటనలో నలుగురు మరణించారు. 

అమెరికాలోని సిన్సినాటీలోని వేర్వేరు ప్రాంతాల్లో దుండగులు కాల్పులు జరిపారు.  ఓవర్ ది రన్ ప్రాంతంలో జరిపిన కాల్పుల్లో ఒకరు మరణించారు. మరో పది మందికి గాయాలయ్యాయి.

ఈ ఘటన సోమవారం నాడు తెల్లవారుజామున చోటు చేసుకొంది. అంతోనియో బైలార్ కాల్పుల్లో గాయపడ్డారు. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.హ్యారియెట్ బీచర్ స్టోవ్ ఇంటి నుండి ఒక బ్లాక్ దూరంలో వాల్నట్ హిల్స్ పరిసరాల్లో ముగ్గురు వ్యక్తులు కాల్పుల్లో చనిపోయారు.

ఈ కాల్పుల్లో సుమారు 18 మందికిపైగా గాయపడ్డారు. కాల్పులకు దిగిన దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాల్పులకు ఎవరు దిగారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. దుండగులకు సంబంధించిన సమాచారం ఇంకా లభ్యం కాలేదని పోలీసులు ప్రకటించారు. టెక్సాస్ లో ని అస్టిన్ లో జరిగిన కాల్పుల్లో పలువురు పోలీసులు గాయపడినట్టుగా సమాచారం అందింది.