మాస్కో: రష్యాలోని బష్కోర్టోస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ఘటనలో 11 మంది వృద్దులు సజీవదహనమయ్యారు.  మంగళవారం నాడు  తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకొంది.

బష్కోర్టోస్థాన్‌లోని ఇషుబుల్డినో గ్రామంలోని ప్రైవేట్ రిటైర్మెంట్ హోంలో ఇవాళ ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది.  ప్రమాద సమయంలో ఈ భవనంలో 15 మంది వృద్ధులున్నారు.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో నలుగురు బయటపడ్డారు. 11 మంది ఈ అగ్నికి సజీవ దహనమయ్యారు.  అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే ఫైరింజన్లు  సంఘటన స్థలానికి చేరుకొని  మంటలను ఆర్పాయి.

ఈ భవనంలో  అగ్ని ప్రమాదానికి గల కారణాలను అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పురాతన భవనాల్లో ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు పాటించకపోవడంతోనే  ఈ ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.