Asianet News TeluguAsianet News Telugu

కరోనాపై గుడ్‌న్యూస్: అస్ట్రాజెనికా వ్యాక్సిన్ కు యూకే ఆమోదం

అస్ట్రాజెనికా-ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ కు యూకే ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
 

AstraZeneca Oxford Covid Vaccine Approved For Use In UK lns
Author
London, First Published Dec 30, 2020, 12:57 PM IST

లండన్: అస్ట్రాజెనికా-ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ కు యూకే ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

గతంలో ఫైజర్ కంపెనీ తయారు చేసిన ఫైజర్ కరోనా వ్యాక్సిన్ కు యూకే ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ అస్ట్రాజెనెకా అభివృద్ది చేసిన కరోనా వైరస్ ను ప్రపంచంలో మొదటిసారిగా ఆమోదించిన దేశంలో బ్రిటన్ రికార్డు సృష్టించింది.

 

ఈ వ్యాక్సిన్ 90 శాతం పనిచేస్తోందని ఆ సంస్థ ప్రకటించింది.  అస్ట్రాజెనెకా ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ను ఉపయోగించేందుకుగాను మెడిసిన్స్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ నుండి సిఫారసును ప్రభుత్వం బుధవారం నాడు అంగీకరించింది.

ఈ టీకాను కనీసం ఆరు నెలల పాటు సాధారణ ఫ్రిజ్ లలో రెండు నుండి ఎనిమిది డిగ్రీల సెల్సియస్ వద్ద నిల్వ చేసుకోవచ్చు. రవాణా విషయంలో కూడ ఎలాంటి ఇబ్బందులు లేవని నిపుణులు చెప్పారు.

ఇండియాలో ఆక్స్ ఫర్డ్ అస్ట్రాజెనెకా కరోనా వైరస్  వ్యాక్సిన్ యొక్క దేశీయ తయారీదారు సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ఈ వ్యాక్సిన్ ను అత్యవసరంగా వినియోగించుకొనేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. సీరం ఇనిస్టిట్యూట్ ఇప్పటికే 40 నుండి 50 మిలియన్ మోతాదుల వ్యాక్సిన్ ను తయారు చేసింది. నెలకు 100 మిలియన్ల వ్యాక్సిన్ సామర్ధ్యం సీరం ఇనిస్టిట్యూట్ కు ఉంది. 

కరోనా కారణంగా ఇప్పటికే ప్రపంచంలో 1.7 మిలియన్ల మంది మరణించారు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను కరోనా తీవ్రంగా దెబ్బతీసింది.  ఏడాది క్రితం చైనాలోని వుహాన్ లో ఈ వైరస్ కేసులు నమోదయ్యాయి. చైనా నుండి ఈ వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios