పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ నేత ఇమ్రాన్ ఖాన్ పై కాల్పుల ఘటన ఆ దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. అయితే దీనిపై ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. ఈ కాల్పులకు ముగ్గురు వ్యక్తులే కారణం అని చెప్పారు.
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై గురువారం కాల్పులు జరిగాయి. కొన్ని నెలల కిందట ఆయన ప్రధాని పదవికీ రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో ఆయన ఆ దేశంలో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అందులో దేశంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగానే గురువారం లాహోర్ నుంచి ఇస్లామాబాద్ వరకు చేపట్టిన ర్యాలీలో ఓ దుండగుడు ఆయనపై గన్ తో కాల్పులు చేశాడు. అయితే ఈ ఘటనలో ఇమ్రాన్ ఖాన్ కు కాలుకు బుల్లెట్ గాయం అయ్యింది. వెంటనే ఆయనను హాస్పిటల్ కు తరలించాడు. దీంతో ప్రాణాప్రాయం నుంచి తప్పించుకున్నాడు.
టెక్ దిగ్గజం విప్రో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా అమిత్ చౌదరి నియామకం.
కాగా.. ఈ ఘటనపై నవాజ్ షరీఫ్ పలువురిపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ దాడికి ముగ్గురు వ్యక్తులు కారణం అని ఆరోపించారు. ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్ తో పాటు మరో ఇద్దరి ఆదేశాలతోనే తనపై బుల్లెట్లతో దాడి జరిగిందని ఆయన అనుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆయన పార్టీ అయిన పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ సీనియర్ నేతలు వెల్లడించారు.
సుబ్రమణ్యస్వామికి తగిన భద్రత కల్పించాం.. హైకోర్టుకు వివరించిన కేంద్రం
‘‘ కొంత సమయం కిందట తనతరపున ఈ ప్రకటనను విడుదల చేయాలని ఇమ్రాన్ ఖాన్ మాకు చెప్పారు. ఈ ఘటన ప్రధాని షెహబాజ్ షరీఫ్, పాకిస్థాన్ అంతర్గత మంత్రి రానా సనావుల్లా, మేజర్ జనరల్ ఫైసల్ ల ఆదేశానుసారం జరిగిందని ఆయన భావిస్తున్నారు. ఈ విషయంలో ఆయనకు సమాచారం అందిందని చెప్పారు.” అని పీటీఐ ప్రధాన కార్యదర్శి నాయకుడు అసద్ ఉమర్, మరో నేత మియాన్ అస్లాం ఇక్బాల్ అన్నారు.
ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి నిలకడగా ఉందని, ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని వారు స్పష్టం చేశారు. ఇమ్రాన్ ఖాన్ అనుమానిస్తున్న ముగ్గురిని వారి పదవుల నుంచి తొలగించాలని అసద్ ఉమర్ విడుదల చేసిన ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు. ‘‘ ఇమ్రాన్ ఖాన్ ప్రమాదంలో ఉన్నారని మాకు నివేదికలు అందాయి. దీంతో నేను ఆయనతో మాట్లాడాను. అయితే ఈ విషయాన్ని మనం అల్లాకు వదిలివేయాలని ఖాన్ అన్నారు. ఈ ముగ్గురిని వారి పదవుల నుండి తొలగించాలని ఇమ్రాన్ ఖాన్ డిమాండ్ చేశారు. వారిని తొలగించకపోతే దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతాయి ’’ అని ఆయన అన్నారు. ‘‘ఇమ్రాన్‌ఖాన్ కాలికి బుల్లెట్ గాయం అయ్యింది. అతడిని సీటీ స్కాన్ చేశారు. ఈ జాతి స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని ఇమ్రాన్ ఖాన్ పదే పదే చెబుతున్నారు. ఎవరికైనా చిన్న అనుమానం ఉంటే ఈరోజే నివృత్తి చేసుకోవాల్సింది ’’అని ఆయన పేర్కొన్నారు.
కాగా.. ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు జరిపిన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. మాజీ ప్రధాని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని, అందుకే ఆయనను చంపాలని నిర్ణయించుకున్నానని పలు మీడియా కథనాలు వెలువడ్డాయి. ‘‘ఇమ్రాన్ ఖాన్ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాడు. నేను దానిని తట్టుకోలేక ఆయనను చంపాలని ప్రయత్నించాను. నేను ఆయనను మాత్రమే చంపాలని అనుకున్నాను. మరెవరినీ చంపాలనే ఉద్దేశం నాకు లేదు. ’’ నిందితుడు పేర్కొన్నారు. పాలక కూటమికి వ్యతిరేకంగా లాంగ్ మార్చ్ చేస్తున్న సమయంలో ఇమ్రాన్ ఖాన్ పై పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని వజీరాబాద్‌లో కాల్పులు జరిగియాని ఏఆర్ వై నివేదించింది.
