Asianet News TeluguAsianet News Telugu

అమెరికా హెల్త్‌కేర్ ఎక్స్‌లెన్స్ అవార్డులను ప్రకటించిన ఏషియానెట్ న్యూస్.. విజేతలు వీరే

అమెరికా హెల్త్‌కేర్ ఎక్స్‌లెన్స్ అవార్డులను ఏషియానెట్ న్యూస్ ప్రకటించారు. ఐదు కేటగిరీల్లోని విజేతల పేర్లను వెల్లడించారు. ఈ అవార్డును వచ్చే నెల 11వ తేదీన అందజేస్తారు.
 

asianet news announces US healthcare excellence awards, winners list out
Author
First Published Nov 29, 2022, 6:55 PM IST

న్యూఢిల్లీ: ఏషియానెట్ న్యూస్ అమెరికా హెల్త్ కేర్ ఎక్స్‌లెన్స్ అవార్డులను ప్రకటించింది. ఆరోగ్య రంగంలో విశేష సేవలు అందించిన ప్రముఖులను గుర్తించి ఈ పురస్కారాలను ప్రముఖ మీడియా సంస్థ ఏషియానెట్ న్యూస్ ప్రకటించింది. ఈ అవార్డుల్లో ఐదు విభాగాలు ఉన్నాయి. యూత్ ఐకాన్, నర్స్ ఆఫ్ ది ఇయర్, డాక్టర్ ఆఫ్ ది ఇయర్, లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్, కొవిడ్ వారియర్‌ కేటగిరీల్లో విజేతల పేర్లను జ్యూరీ వెల్లడించింది.

యూత్ ఐకాన్: ఆండ్రియా ఆగస్టిన్

అమెరికాలోని అట్లాంటాలో నివసిస్తున్న ఆండ్రియా ఆగస్టిన్ ఈ ఏడాది యూత్ ఐకాన్ అవార్డును గెలుచుకున్నారు. డ్యూక్ యూనివర్సిటీలో మెడిసిన్ చదువుతున్న ఆండ్రియా విద్యలో రాణించి పలు అవార్డులను ఇప్పటికే సొంతం చేసుకున్నారు. రైస్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ చేసిన ఆండ్రియా కరోనా మహమ్మారి కాలంలో ట్రీట్‌మెంట్ సంబంధ ఎన్నో ప్రాజెక్టుల్లో పరిశోధనలు చేపట్టారు.

కొవిడ్ వారియర్: మలయాళి రెస్పిరేటరీ థెరపిస్టులు

కరోనా తీవ్రంగా ఉన్నకాలంలో విశేష సేవలు అందించిన ప్రొఫెషనల్స్‌కు ఈ అవార్డు అని జ్యూరీ ప్రకటించింది. ఈ అవార్డు కోసం నామినేట్ చేసిన మలయాళీ మూలాలు ఉన్న ప్రొఫెషనల్స్ అందరూ ఆదర్శవంతమైన సేవలు అందించారని తెలిపింది.

Also Read: చాగంటి కోటేశ్వరరావుకి గురజాడ పురస్కారం: విజయనగరంలో కవులు, కళాకారుల నిరసన ర్యాలీ

స్పెషల్ జ్యూరీ అవార్డు: డాక్టర్ రాగేశ్ కంగత్

కాలిఫోర్నియాలోని సాంతా రోసా వెటెరన్స్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్, కాలిఫోర్నియా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాగేశ్ కంగత్ స్పెషల్ జ్యూరీ పురస్కారం గెలుచుకున్నారు. కొవిడ్ వ్యాప్తికి కట్టడి చేయడానికి ఆయన ఎన్నో విధానాలను అభివృద్ధి చేశారు.

బెస్ట్ డాక్టర్: డాక్టర్ సునీల్ కుమార్

ఫ్లోరిడాలోని బ్రావర్డ్ హెల్త్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ డాక్టర్ సునీల్ పల్మనాలజీ రంగంలో దశాబ్దాలపాటు చేసిన కృషికిగాను ఈ అవార్డు దక్కింది. ఫ్లోరిడా రాష్ట్రాన్ని ఇయాన్ హారికేన్ చెండాడినప్పుడు రెస్క్యూ ఆపరేషన్‌కు సారథ్యం వహించారు.

బెస్ట్ నర్స్: డాక్టర్ టంకమని అరవిందన్

ఆరోగ్య రంగంలో 30 ఏళ్ల అనుభవం, నర్సింగ్‌లో డాక్టరేట్ ఉన్న డాక్టర్ టంకమని అరవిందన్‌ క్లినికల్ నర్స్‌గా అద్భుత సేవలు అందించారు. అరవిందన్ నర్సింగ్ ప్రొఫెషనల్, సోషల్ యాక్టివిస్టు. 

స్పెషల్ జ్యూరీ అవార్డు: ప్రీతి పైనాదత్

టెక్సాస్‌లోని నర్సింగ్ ప్రాక్టీషనర్ 20 ఏళ్ల అనుభవం ఉన్న ప్రీతి పైనాదత్ కరోనా పేషెంట్లకు సేవలు అందించారు. ఆమె చారిటబుల్ యాక్టివిస్టులకూ సమయం కేటాయిస్తారు.

Also Read: ఏషియానెట్ న్యూస్ - ఎన్‌సీసీ వజ్ర జయంతి యాత్ర.. ప్రత్యేక పోస్టర్‌ను ఆవిష్కరించిన రజనీకాంత్..

లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్: డాక్టర్ జాకోబ్ ఈపెన్

అమెరికన్ మలయాళీ డాక్టర్ జాకోబ్ ఈపెన్ మెడికల్ కేర్‌లో అన్ని సెగ్మెంట్‌లోనూ పేరున్నవారు. అలమేడా కౌంటీ హెల్త్ సర్వీసెస్‌లో పని చేస్తున్న ఫ్రీమెంట్ బోర్డు డైరెక్టర్ల సభ్యుడిగా ఉన్నారు. నార్త్ కాలిఫోర్నియాలో పబ్లిక్ ఎలక్షన్‌లో గెలుపొందిన తొలి భారతీయుడు. తిరువనంతపురంలో మెడికల్ కాలేజీలో డిగ్రీ పొందిన ఉన్నత చదువులు వెల్లూరర్‌లోని సీఎంసీలో పూర్తి చేశారు. కాలిఫోర్నియా యూనివర్సిటీలోనూ ఉన్నత చదువులు చదివారు.

డాక్టర్ ఎంవీ పిళ్లై సారథ్యంలోని జ్యూరీలో డాక్టర్ ఎస్ఎస్ లాల్, డాక్టర్ ఫ్రీము వర్గీస్, డాక్టర్ అన్నీ పాల్‌లు సభ్యులుగా ఉన్నారు. అవార్డు సెలెక్షణ్ సమావేశంలో ఏషియానెట్ న్యూస్ ఎండీ మనోజ్ కే దాస్, సీనియర్ అసోసియేట్ ఎడిటర్ అనిల్ ఆదూర్‌లూ ఉన్నారు. 

ఈ అవార్డులను డిసెంబర్ 11న లాస్ ఏంజిల్స్‌లో నిర్వహించే కార్యక్రమంలో అందజేస్తారు.

Follow Us:
Download App:
  • android
  • ios