వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగిన రోజు రాత్రి భారీగా హింస చెలరేగే అవకాశం ఉందని అందరూ భయపడ్డారు. కానీ ట్రంప్ తాను విజయం సాధిస్తున్నానని ప్రకటించారు. ఈ ప్రకటన రానున్న రోజుల్లో మరింత అశాంతికి దారితీసే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

వాషింగ్టన్, డెన్వర్, పోర్ట్ ల్యాండ్, లాస్ ఏంజిల్స్ నగరాల్లో బుధవారం నాడు సాయంత్రం నిరసనకారులు గుమికూడారు. వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఎన్నికలకు ముందు సుమారు డజనుకు పైగా రాష్ట్రాల్లో నేషనల్ గార్డ్స్ ట్రూప్ పహరాకాస్తున్నాయి. 

స్టాండంప్ మిచిగాన్  టూ అన్ లాక్  పేరుతో ఫేస్ బుక్ గ్రూప్ బుధవారం నాడు ఒక పిలుపునిచ్చింది.  మిచిగాన్ ఫలితాలను సమం చేయడాన్ని సవాల్  చేయడాన్ని ప్రశ్నించేందుకు స్థానికంగా కోబో హాల్ అని పిలువబడే డెట్రాయిట్ యొక్క టీసీఎఫ్ సెంటర్ కు వెళ్లమని వాలంటీర్లను కోరింది.నిరసనకారులు చాలామంది తాము పోల్ వాచర్లు కావాలనుకొంటున్నట్టుగా చెప్పారు.

ఓటింగ్ జరుగుతున్న సెంటర్ వద్దకు వచ్చిన వారిని ఫ్రంట్ డోర్ వద్ద పోలీసులు అడ్డుకొన్నారు. ఇది గమనించిన కొందరు వెనుక డోర్ వద్దకు వెళ్లి కౌంటింగ్ ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

సెంట్రల్ పార్క్ , మాన్హాటన్ లోని  న్యూయార్క్ పబ్లిక్ లైబ్రరీ వెలుపల బుధవారం నాడు వందలాది మంది నిరసనకారులు గుమికూడారు. జోబైడెన్ కు మద్దతు ఇచ్చే సంకేతాలను చూపుతూ ప్రతి ఓటును లెక్కించాలని కోరారు.

బుధవారం నాడు సాయంత్రం పలు నగరాల్లో నిరసనలు చోటు చేసుకొన్నాయి. డెన్వరన్ దిగుమ సమీపంలో చెక్ క్యాషింగ్ స్టోర్ వద్ద కిటికీలు పగులగొట్టిన తర్వాత పోలీసులు నిరసనకారులను చెదరగొట్టారు. ట్విట్టర్ లో పోస్టు చేసిన వీడియో ప్రకారంగా చాలా మంది నల్లని దుస్తులు ధరించిన ఆందోళనకారులు లిబరలిజం దట్ ఎనేబుల్ ఇట్ అని రాసి ఉన్న బ్యానర్ పట్టుకొన్నారు.

మిన్నియాపాలిస్లో లో జార్జ్ ఫ్లాయిడ్ మరణించిన తర్వాత మే నుండి సాధారణ నిరసనలకు ఒరెగాన్ లోని పోర్ట్ ల్యాండ్ వేదికగా మారింది. డౌన్ టౌన్ లో కనీసం ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

పోర్ట్ ల్యాండ్ లో అదే సమయంలో మరో గ్రూప్ శాంతియుతంగా ప్రదర్శన నిర్వహించింది. ఈ నిరసనల వెనుక ఏ గ్రూపులున్నాయో స్పష్టంగా తెలియడం లేదు.

లాఫాయెట్ స్క్వేర్ సమీపంలో ముగ్గురు వ్యక్తులను పొడిచిన సంఘటనపపై వాషింగ్టన్ పోలీస్ చీఫ్ పీటర్ మీడియాకు వివరించారు. ఇద్దరు పురుషులు, ఓ మహిళ ఈ ఘటనలో గాయపడినట్టుగా చెప్పారు. వీరికి ప్రాణహాని లేదని చెప్పారు.

రాజకీయ అనుబంధం కారణంగా ఎవరినైనా దాడి చేస్తే అది ద్వేషపూరితమైన నేరంగా భావించవచ్చని పోలీసులు ప్రకటించారు.న్యూయార్క్ నగరంలో మతాధికారులు నిరసనకారులకు మద్దతు ఇవ్వడానికి సిద్దమౌతున్నారు.  ఆందోళనలకు దూరంగా ఉండాలని మేయర్ బిల్ డి బ్లాసియో కార్యాలయం నుండి పిలుపిచ్చిన విషయం తెలిసిందే.

చిల్లర వ్యాపారులు  తమ వ్యాపార సంస్థలపై రక్షణ చర్యలు చేపట్టాయి. కిటీకీలపై తాత్కాలికంగా రక్షణ బోర్డులను ఏర్పాటు చేశారు. తమ వ్యాపారం నిర్వహించుకొనేందుకు రక్షణ చర్యలు తీసుకొన్నారు.కచ్చితమైన ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు ఈ రక్షణ బోర్డులు అలాగే ఉంటాయని ఫిఫ్త్ అవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు జెరోమ్ బార్త్ చెప్పారు.

చికాగోలోని మాగ్నిఫిసెంట్ మైల్ అసోసియేషన్ ఛైర్మెన్ రిచ్ మాట్లాడుతూ కనీసం వారం రోజుల పాటు రక్షణ చర్యలు తీసుకొంటామన్నారు.లాస్ ఏంజిల్స్ లో రోడియో డ్రైవ్ కనీసం వారం రోజుల పాటు మూసివేయనున్నట్టుగా ప్రకటించింది.

also read:అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020: ఏ రాష్ట్రంలో ఎవరికి మొగ్గు

ఎన్నికలకు ముందే మిన్నియాపాలిస్ పోలీసులు ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడిని మేలో హత్య చేశారు. నెల రోజుల నిరసనలు అశాంతితో అమెరికా అట్టుడికిపోయింది.

జార్జియా, మిచిగాన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ ఒరెగాన్ ఇటువంటి కార్యకలాపాలకు ఎక్కువ ప్రమాదం ఉందని నివేదికలో పేర్కొంది. నార్త్ కరోలినా, టెక్సాస్, వర్జీనియా, కాలిఫోర్నియా, న్యూ మెక్సికో లో ఉన్నాయి.

మితవాత సంస్థలలో హింసకు ఆన్ లైన్ పిలుపులు కూడ పెరిగాయి. బుధవారం నాడు ఉదయం తానను ఎన్నికల్లో గెలిచినట్టుగా ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రకటన ట్రంప్ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణకు ప్రేరేపించనుందని నివేదికలు చెబుతున్నాయి.

ఈ వారం తర్వాత  అశాంతి మరింత పెరిగే అవకాశం ఉందని సాయుధ సంఘర్షణ ప్రాజెక్టు డైరెక్టర్ రౌదాబే కిషి చెప్పారు.