Asianet News TeluguAsianet News Telugu

రోడ్లపై కరెన్సీ నోట్లు: వాహనాలు ఆపి తీసుకొన్న జనం, ట్రాఫిక్ జామ్

కాలిఫోర్నియాలో రోడ్డపైనే కరెన్సీ కట్టలు కట్టలుగా పడిపోయింది. ఈ కరెన్సీ కట్టలను చూసిన వాహన చోదకులు రోడ్లపైనే వాహనాలను నిలిపి కరెన్సీని ఏరుకొన్నారు.  ఈ విషయం తెలిసిన పోలీసులు కరెన్సీ నోట్లను తిరిగి ఇవ్వాలని కోరారు.

Armored truck spill on highway sparks cash-grab frenzy
Author
California City, First Published Nov 21, 2021, 11:05 AM IST

వాషింగ్టన్: అమెరికాలోని కాలిఫోర్నియాలోని ఫ్రీవే రహదారిపై పెద్ద ఎత్తున కర్నెన్సీ నోట్లు  చెల్లా చెదురుగా పడిపోయాయి. ఈ కరెన్సీ నోట్లను చూసిన వాహనదారులు రోడ్డుపైనే వాహనాలను నిలిపివేసి కరెన్సీ నోట్లను తమ జేబుల్లో నింపుకొన్నారు. ఈ దృశ్యాలను స్థానికులు చిత్రీకరించి సోషల్ మీడియాలో  వైరల్ గా మారాయి.శుక్రవారం నాడు అమెరికా కాలమానం ప్రకారంగా ఉదయం తొమ్మిది గంటల సమయంలో  ఈ రోడ్డుపై వాహనం నుండి currency నోట్లు రోడ్డుపై పడిపోయాయి. వాహనం నుండి నోట్లు కింద పడడంతో వాహనాలను రోడ్డుపైనే నిలిపి వాహనదారులు కరెన్సీ నోట్లను తీసుకోవడానికి పోటీలు పడ్డారు.

also read:క్రిప్టోకరెన్సీపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. తప్పుడు చేతుల్లోకి వెళ్లకూడదు అంటూ..

శాన్‌డిగో నుండి California లోని ఫెడరల్ డిపాజిట్  ఇన్సూరెన్స్ కార్యాలయానికి డబ్బు సంచులతో వెళ్తున్న వాహనం తలుపు ఆకస్మాత్తుంగా తెరుచుకోవడంతో  వాహనం నుండి కరెన్సీ నోట్లు రోడ్డుపై పడిపోయాయి. 20, ఒక్కdollar నోట్లే రో్డ్లపై పడిపోయాయి.  రోడ్డుపై కరెన్సీ నోట్లు పడిపోయిన  విషయం తెలుసుకొన్న పోలీసులు అక్కడికి చేరుకొన్నారు. రోడ్డును దిగ్భందించారు. రోడ్డుపై కరెన్సీ నోట్లను తీసుకొన్న వారి నుండి పోలీసులు కరెన్సీని తీసుకొన్నారు. పోలీసుల రాకను గుర్తించిన కొందరు  అక్కడి నుండి వెళ్లిపోయారు.  మొత్తంగా ఎంత డబ్బు పోయిందనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. 

ఈ ఘటనకు సంబంధించి బాడీ బిల్డర్ డెమీ బాగ్జీ ఇన్‌స్టాగ్రామ్ లో వీడియోను పోస్టు చేశారు. ఈ ఘటనకు సంబందించి పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు.మరోవైపు  రోడ్డుపై పడిన నగుదను తీసుకొన్న వారు క్రిమినల్ కేసులు  ఎదుర్కోవాల్సి వస్తోందని సార్టెంట్ మార్జిన్ హెచ్చరించారు. సంఘటన స్థలంలో కొందరు తీసిన వీడియోల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. రోడ్డుపై పడిన కరెన్సీని తీసుకొన్న వారు తిరిగి ఇవ్వాలని ఎఫ్‌బీఐ అధికారులు కోరారు. ఇప్పటికే సుమారు 12 మంది తాము తీసుకొన్న నగదును తిరిగి ఇచ్చారని ఎఫ్‌బీఐ అధికారులు తెలిపారు. రెండు గంటల తర్వాత అధికారులు రోడ్డును తిరిగి ప్రారంభించారు.

రోడ్డుపై దొరికిన నగదును తీసుకొన్నారనే అనుమానంతో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.  కరెన్సీతో వెళ్తున్న వాహనం తలుపులు ఎలా తెరుచుకున్నాయనే విషయమై ఎఫ్‌బీఐ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ రోడ్డుపై వాహనాలను నిలిపినప్పుడు ప్రమాదం జరిగిందని భావించారు. కానీ  రోడ్డుపై కరెన్సీ కట్టలు చూసి వాహన చోదకులు కరెన్సీని తీసుకొని జేబుల్లో నింపుకొన్నారు. రోడ్డుపై వేల డాలర్ల కరెన్సీని గుర్తించినట్టుగా వాహన చోదకులు తెలిపారు.

గతంలో కూడా రోడ్లపై కరెన్సీ నోట్లు వెద జల్లిన ఘటనలు ఇండియాలోనూ పలు దేశాల్లో చోటు చేసకొన్నాయి. కరెన్సీ నోట్లను వెద జల్లిన ఘటనలపై ఆయా దేశాల్లో కేసులు కూడా నమోదయ్యాయి. రోడ్డుపై దొరికిన నగదును వాహనదారులు అందినకాడికి తీసుకొన్నారని పోలీసుల గుర్తించారు. రోడ్లపై మిగిలిన ఉన్న కరెన్సీని పోలీసులు వెతికి బ్యాగుల్లో నింపారు. ఈ కరెన్సీని ఎవరు తీసుకెళ్లారనే విషయమై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోల్లో డబ్బులు తీసుకొంటున్న వారిని గుర్తించే పనిలో పోలీసులున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios