దారుణం.. తనను మగాడిగా ఎందుకు పెంచలేదని తల్లితో గొడవ, అనంతరం దారుణ హత్య.. ఎక్కడంటే ?
తనను సరిగా పెంచలేదని, అసలైన మగాడిలా ఎదగేందుకు కృషి చేయలేందంటూ ఓ కుమారుడు తన తల్లిని చంపేశాడు. ఈ ఘటన అమెరికాలో జరిగింది. పోలీసులు కుమారుడిని అరెస్టు చేశారు.

ఓ కుమారుడు కసాయిగా మారాడు. కన్నతల్లినే కడతేర్చాడు. తనను మగాడిగా ఎందుకు పెంచలేదంటూ ఆమెపై ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఇటీవల జరగగా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓసియోలా కౌంటీ షెరిఫ్ ఆఫీసు వెల్లడించిన వివరాల ప్రకారం.. కిస్సిమ్మీ ప్రాంతంలో ఓ తల్లి తన కుమారుడు, కూతురుతో కలిసి నివసిస్తోంది. అయితే ఇటీవల కుమారుడు మ్యాథ్యూ స్టీవర్ట్ సిస్లీ తల్లితో గొడవపడ్డాడు.
తాను చెప్పిన సర్ఫ్ భర్త తేలేదని... పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య...!
ఈ క్రమంలో ఆమెతో గొడవ పడ్డాడు. తనను సరిగా ఎందుకు పెంచలేదని ఆమెను నిలదీశాడు. అసలైన మగాడిలా పెరిగేలా ఎందుకు చర్యలు తీసుకోలేదని వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో కోపంలో తల్లిని దారుణంగా హత్య చేశాడు. ఈ సమయంలో అతడి చెల్లికి కూడా గాయాలు అయ్యాయి. అనంతరం అక్కడి నుంచి అతడు పారిపోయాడు.
సహజీవనం చేస్తున్న మహిళ ముఖం చిధ్రం చేసి, గొంతుకోసి చంపిన వ్యక్తి.. చిటికెన వేలు నరికి..
ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందింది. ఆ సమయంలో తల్లి మంచంపై చనిపోయి కనిపించింది. ఆమె కూతురు కూడా గాయాలతో బాధపడుతూ కూర్చొంది. వెంటనే వారిద్దరనికి హాస్పిటల్ కు తరలించారు. గాయపడిన యువతికి ట్రీట్మెంట్ అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
ఆ బిచ్చగాడు ఐదు కోట్లకు అధిపతి.. కానీ రోడ్లమీద బిచ్చం ఎత్తుకుంటూ.. ఫుట్ పాత్ పై జీవిస్తూ..
ఈ క్రమంలో తాజాగా నిందితుడు మ్యాథ్యూను పోలీసులు అరెస్టు చేవారు. అతడి విచారణలో పోలీసులు ఖంగుతినే విషయాలు తెలుసుకున్నారు. తన తల్లిని కావాలనే హత్య చేశానని చెప్పాడు. అయితే అనుకోకుండా చెల్లికి గాయాలు అయ్యాయిన తెలిపాడు. తల్లిని చంపినందుకు తాను బాధపడటం లేదని అన్నాడు. తనను సరిగా పెంచలేదని కాబట్టి ఆమెకు ఇలా జరగాల్సిందేని పశ్చాతాపం లేకుండా చెప్పాడు. అయితే నిందితుడు మ్యాథ్యూకు జైలు శిక్ష పడే ఛాన్స్ ఉందని గవర్నమెంట్ లాయర్లు తెలిపారు.