అమెరికాకు చెందిన న్యాయమూర్తి భార్యను కాల్చి చంపాడు. అతని వద్ద 47 తుపాకులు, 26,000 రౌండ్ల మందుగుండు సామగ్రి ఉన్నాయి.

అమెరికా : అమెరికాలో జడ్జి జెఫ్రీ ఫెర్గూసన్‌ అనే న్యాయమూర్తి తన భార్యను ఛాతిలో కాల్చి చంపాడు. జడ్జి జెఫ్రీ ఫెర్గూసన్‌ వద్ద డజన్ల కొద్దీ తుపాకులు, 26,000 రౌండ్ల మందుగుండు సామాగ్రి ఉన్నాయని అధికారులు కోర్టుకు తెలిపారు. అంతేకాదు అతని భార్య ఛాతీపై తుపాకీ గాయంతో చనిపోయారని తెలిపారు.

తాగిన మత్తులో ఓ న్యాయమూర్తి తన భార్యను తుపాకీతో కాల్చి చంపినట్లు అభియోగాలు మోపారు, కాల్పులు జరిపిన తర్వాత "రేపు నేను అందుబాటులో ఉండను. కస్టడీలో ఉంటాను" అని సహోద్యోగికి మెసేజ్ పంపినట్లు మంగళవారం కోర్టులో విచారణ సందర్భంగా తెలిపారు. 

92 ఏళ్ల వయసులో 66 ఏళ్ల మహిళతో డేటింగ్ చేస్తున్న రూపర్ట్ మర్దోక్!

ఆరెంజ్ కౌంటీ ఉన్నతాధికారి చెబుతూ...72 ఏళ్ల ఫెర్గూసన్‌ను అరెస్టు చేయడానికి వెళ్లినప్పుడు అతని దగ్గర మద్యం వాసన గుప్పున వచ్చిందని తెలిపారు. వీరద్దరూ ఇంటి సమీపంలోని రెస్టారెంట్‌లో డిన్నర్ గురించి వాదించుకోవడం ప్రారంభించారు. ఈ ఘటన ఆగస్ట్ 3న జరిగింది. ఆ సమయంలో న్యాయమూర్తి "తుపాకీ’’ని అనుకరించే విధంగా చేతితో సంజ్ఞ చేస్తూ... భార్యను బెదిరించాడని ఆరెంజ్ కౌంటీ డిప్యూటీ డిస్ట్రిక్ట్ అటార్నీ క్రిస్టోఫర్ అలెక్స్ కోర్టుకు తెలిపారు.

అక్కడినుంచి ఇంటికి వచ్చిన తరువాత.. ఇంట్లో కూడా వాదన కొనసాగింది. ఆ సమయంలో భార్య షెరిల్ ఫెర్గూసన్ (65) భర్తను రెచ్చగొడుతూ.. నిజమైన తుపాకీని ఎందుకు గురిపెట్టకూడదు? అన్నది. దీంతో రెచ్చిపోయిన ఫెర్గూసన్ తన పిస్టల్‌ని తీసి, ఆమె ఛాతీపై కాల్చాడు.. అని పోలీసులు తెలిపారు. ఆ తరువాత ఫెర్గూసన్ 911కి కాల్ చేసి, అతని భార్యను కాల్చానని చెప్పి, పారామెడిక్‌ని అడిగాడు.

ఆమెను కాల్చింది అతనేనా అని అవతలి వ్యక్తి అడిగినప్పుడు, ఆ సమయంలో అది చెప్పడానికి ఇష్టపడలేదని అలెక్స్ కోర్టుకు తెలిపారు. ఫోన్ పెట్టేసిన తరువాత ఫెర్గూసన్ తన కోర్ట్ క్లర్క్, న్యాయాధికారికి... ‘‘నేను నా భార్యను కాల్చాను. రేపు నేను ఉండను. కస్టడీలో ఉంటాను. నన్ను క్షమించండి" మెసేజ్ చేశాడు అని అలెక్స్ తెలిపారు. 

ఆ తరువాత పోలీసులు ఇంట్లో జరిపిన సోదాల్లో 47 తుపాకులు దొరికాయి, అన్నీ లైసెన్స్ డే అని అన్నారు. 2015 నుండి న్యాయమూర్తిగా ఉన్న ఫెర్గూసన్ మంగళవారం కోర్టుకు హాజరైనప్పుడు హత్య చేయలేదని ఖండించారు. న్యాయవాది పాల్ మేయర్ కోర్టు బయట విలేకరులతో మాట్లాడుతూ.. "ఇవి అనుకోకుండా, ప్రమాదవశాత్తు జరిగిన కాల్పులు మాత్రమే. నేరం కాదని స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాం" అన్నారు. ప్రస్తుతం ఫెర్గూసన్ బెయిల్‌పై విడుదలయ్యాడు. అతడు మద్యం తీసుకోవద్దని ఆదేశించారు. అక్టోబరు 30న మళ్లీ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది.