న్యూయార్క్: స్వలింగ సంపర్కం తనకు వరమని  ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ అభిప్రాయపడ్డారు. తాను ఆపిల్ సంస్థకు సీఈఓగా ఉన్న సమయంలో కూడ స్వలింగ సంపర్కుడినేనని ఆయన బయటపెట్టారు.

ఓ ఆంగ్ల మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడ  ఆయన బయటపెట్టారు.  స్వలింగ సంపర్కం నిర్ణయం తీసుకొన్నందుకు తాను గర్వపడుతున్నానని టిమ్ కుక్ చెప్పారు. చాలా మంది సమస్యలు విన్న తర్వాత తాను కూడ స్వలింగ సంపర్కుడిగా మారినట్టు ఆయన చెప్పారు.

తమ సమస్యలు చెప్పుకొనేందుకు ముందుకు వచ్చిన వారిని స్పూర్తిగా తీసుకొనే తాను  ఈ విషయాన్ని బయటపెట్టినట్టు చెప్పారు.  తనను ఉదహరణగా తీసుకొని అనే క మంది కూడ తమ లోపాలను  బహిర్గతం చేసేందుకు  ధైర్యంగా ముందుకు వస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. మనిషిలోని లోపం ఉంటే ఉద్యోగాలు చేసేందుకు ఇబ్బందులు ఉండవన్నారు.