ఇప్పటికే కరోనాతో సంక్షోభంలో ఉన్న ఉత్తర కొరియాలో మరో కొత్త వ్యాధి వెలుగులోకి వచ్చింది. అయితే ఈ వ్యాధి పేరు ఏంటి ? దాని ప్రభావం ఎంత వరకు ఉంటుంది అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు.
కోవిడ్-19 తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతోంది. ప్రపంచం అంతా ఈ కేసులతోనే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఉత్తర కొరియాలో మరో అంటూ వ్యాధి గురువారం వెలుగులోకి వచ్చింది. నైరుతి హేజు నగరంలో కొత్త వ్యాధి గుర్తించామని నివేదికలు వెలువడ్డాయి. అయితే ఇది ఇప్పటి వరకు ఎంత మందికి సోకింది ? ఎలాంటి వ్యాధి అనేది ఇంకా అస్పష్టంగానే ఉంది.
కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (KCNA) తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర కొరియాలోని నైరుతి హేజు నగరంలో ఒక తీవ్రమైన ఎంటెరిక్ ఎపిడెమిక్ గా ఉంది అని పేర్కొంది. ‘‘ నగరంలో తీవ్రమైన అంటు వ్యాధి విజృంభించడంతో వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా ప్రధాన కార్యదర్శి కిమ్ జోంగ్ ఉన్ జూన్ 15వ తేదీన తన కుటుంబం తయారు చేసిన మందులను సౌత్ హ్వాంగ్‌హే ప్రావిన్స్‌లోని వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా కు చెందిన హేజు సిటీ కమిటీకి పంపారు’’ అని KCNA తెలిపింది.
monkeypox: మంకీపాక్స్.. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించే యోచనలో డబ్ల్యూహెచ్‌వో !
కాగా ఈ అంటు వ్యాధిని వీలైనంత త్వరగా అరికట్టాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. అనుమానిత కేసులను దాని ప్రసార మార్గాలను పూర్తిగా నిలిపివేయడానికి, ఎపిడెమియోలాజికల్ పరీక్ష, శాస్త్రీయ పరీక్షల ద్వారా రోగులను గుర్తించాలని సూచించారు. వ్యాధి సోకిన వారిని ఆయా ప్రాంతాల్లో ప్రజారోగ్య సంస్థలు అత్యంత చిత్తశుద్దితో చికిత్స అందిచాలని కోరారు.
పైలట్ల అప్రమత్తత 525 మందిని కాపాడింది.. ఆకాశంలో తప్పిన పెనుప్రమాదం..
అయితే ఈ పరిణామంపై దక్షిణ కొరియా అధికారులు, నిపుణులు స్పందించారు. ఈ వ్యాధి నీటి సరఫరా ద్వారా వ్యాపించే కలరా లేదా టైఫాయిడ్ కావచ్చునని చెప్పారు. కాగా ఉత్తర కొరియా గత 24 గంటల్లో జ్వర లక్షణాలతో మరో 26,010 కొత్త కేసులను నమోదు చేసింది. ఏప్రిల్ చివరి నుండి దేశవ్యాప్తంగా మొత్తం జ్వరం రోగుల సంఖ్య 4.56 మిలియన్లకు చేరుకుంది. ఈ మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య 73కి చేరుకుంది. ప్యోంగ్యాంగ్ ప్రతిరోజూ జ్వర రోగుల సంఖ్యను ప్రకటిస్తోంది. అయితే టెస్టింగ్ కిట్ లు లేకపోవడం వల్ల ప్రభుత్వం కావాలనే తక్కువ సంఖ్యలో కోవిడ్ కేసులను చూపిస్తోందని నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
చైనా నిజంగానే గ్రహాంతరవాసుల సంకేతాలను గుర్తించిందా?
కాగా ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన అంటు వ్యాధిపై హెల్త్ వెబ్ సైట్ DPRKHEALTH.ORG హెడ్ అహ్న్ క్యుంగ్-సు స్పందించారు.“ ఉత్తర కొరియాలో మీజిల్స్ లేదా టైఫాయిడ్ వ్యాప్తి అసాధారణం కాదు. అయితే అక్కడ ఒక అంటు వ్యాధి వ్యాప్తి చెందడం నిజమేనని నేను భావిస్తున్నాను. కిమ్ తన ప్రజల పట్ల శ్రద్ధ వహిస్తున్నాడని నొక్కిచెప్పడానికి ఉత్తర కొరియా దానిని ఒక అవకాశంగా ఉపయోగిస్తోంది” అని ఆయన వ్యాఖ్యానించారు. కాబట్టి ఇది వైద్య సందేశం కంటే రాజకీయ సందేశం లాగానే కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు.
