Global health emergency: క‌రోనా మ‌హ‌మ్మారి మాదిరిగా మంకీపాక్స్ విజృంభించ‌బోతోందా?  అనే ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్‌వో) మంకీపాక్స్ పై కీల‌క నిర్ణ‌యం తీసుకోవ‌డానికి ఈ నెల‌లో స‌మావేశం కాబోతోంది.  

World Health Organization: కేవ‌లం ఆఫ్రికాలోని కొన్ని దేశాల‌కే ప‌రిమిత‌మై క‌నిపించే మంకీపాక్స్ కేసులు.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ దేశాల‌కు వ్యాపిస్తున్నాయి. ఇప్ప‌టికే చాలా దేశాల‌కు మంకీపాక్స్ విస్త‌రించ‌గా.. ప‌లు దేశాల్లో ఆందోళ‌న‌క‌రంగా వ్యాపిస్తున్న‌ద‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. క‌రోనా మ‌హ‌మ్మారి మాదిరిగా మంకీపాక్స్ విజృంభించ‌బోతోందా? అనే ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్‌వో) మంకీపాక్స్ పై కీల‌క నిర్ణ‌యం తీసుకోవ‌డానికి ఈ నెల‌లో స‌మావేశం కాబోతోంది. రెండేండ్ల క్రితం క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ క్ర‌మంలో గ్లోబ‌ల్ హెల్త్ ఎమ‌ర్జెన్సీని ప్ర‌క‌టించింది. ఇలాంటి విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని మంకీపాక్స్ ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించాలా? వద్దా? అనే నిర్ణ‌యం తీసుకోవ‌డానికి జూన్ 23న వైద్య ఆరోగ్య నిపుణులు, ప‌రిశోధ‌కుల‌తో స‌మావేశం కాబోతున్న‌ది. డ‌బ్ల్యూహెచ్‌వో ఏం చెప్ప‌బోతున్న‌ద‌ని యావ‌త్ ప్ర‌పంచం ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది. అయితే, క‌రోనా మాదిరిగా మంకీపాక్స్ కొత్త వ్యాధి కాదు.. కానీ ఇది వ్యాపిస్తున్న తీరు ప్ర‌స్తుత ఆందోళ‌న‌ల‌కు ఆజ్యం పోసింది. 

మే 13 నాటికి ఉన్న వివ‌రాల ప్ర‌కారం.. మంకీపాక్స్ ఇప్ప‌టివ‌ర‌కు 39కి పైగా దేశాల‌కు వ్యాపించింది. ఆయా ఆయా దేశాల్లో 1600 కేసులు అధికారికంగా ధ్రువీక‌రించ‌బ‌డ్డాయి. మ‌రో 1500ల‌కు పైగా అనుమానిత కేసులు నివేదించ‌బ‌డ్డాయి. మంకీపాక్స్ కేసులు నివేదించ‌బ‌డిన వాటిలో ఏడు ఆఫ్రిక‌న్ దేశాలు ఉన్నాయి. ఈ దేశాల్లో మంకీపాక్స్ కేసులు వెలుగులోకి రావ‌డం సాధార‌ణ విష‌య‌మే.. అయితే, మిగిలిన దేశాలకు మంకీపాక్స్ పాక‌డం ఇప్పుడు ఆందోళ‌న క‌లిగిస్తోంది. మంకీపాక్స్ కారణంగా 2022లో మొత్తం 72 మరణాలు నమోదయ్యాయి. అవన్నీ ఆఫ్రికాకు మాత్రమే పరిమితమయ్యాయి. కొత్తగా ప్రభావితమైన దేశాలలో ఇప్పటివరకు మ‌ర‌ణాలు సంభ‌వించ‌లేదు. వ్యాధి వ్యాప్తి చెందుతున్న ప్రాంతాలకు ప్రత్యక్ష లేదా ఇటీవలి ప్రయాణ లింక్‌లు లేని ప్రదేశాలలో ఏకకాలంలో మంకీపాక్స్ కనిపించడం అనేక వారాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు గుర్తించబడని ప్రసారం ఉండవచ్చునని సూచిస్తుంది అని WHO తెలిపింది. ఇటీవలి కేసులు వెస్ట్ ఆఫ్రికా క్లాడ్ అని పిలువబడే మంకీపాక్స్ తక్కువ ప్రాణాంతక వైవిధ్యంతో ముడిపడి ఉన్నాయి. ఇది మొత్తం వంద కేసులలో ఒకటి కంటే తక్కువ మరణాలను కలిగివుంద‌ని స‌మాచారం. 

WHO చీఫ్ టెడ్రోస్ అధనామ్ గెబ్రేయేసస్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ వ్యాప్తి స్పష్టంగా అసాధారణమైనదిగా ఉంద‌న్నారు. ఐరోపాలో వ్యాప్తి ప్రమాదక‌రంగా ఉంద‌ని మ‌రో అధికారి పేర్కొన్నారు. ప్ర‌స్తుతం మంకీపాక్స్ వైర‌స్ ఎలా వ్యాపిస్తున్న‌దనేది తెలుసుకోవ‌డం ముఖ్య‌మని తెలిపారు. WHO ఈసారి సోకిన వారిలో వైవిధ్యమైన లక్షణాలను గుర్తించింద‌న్నారు. చాలా సందర్భాలలో జ్వరం, వాపు శోషరస కణుపులు మరియు ముఖం, శరీర అంత్య భాగాలలో దద్దుర్లు వంటివి మంకీపాక్స్ ల‌క్ష‌ణాలుగా ఉంటాయి అని తెలిపారు. రోగలక్షణ రోగితో సన్నిహిత శారీరక సంబంధం ద్వారా మంకీపాక్స్ వ్యాపిస్తుంది. అయితే, లక్షణాలు లేని వ్యక్తులు వ్యాధిని వ్యాప్తి చేస్తారా అనేది దానిపై స్ప‌ష్ట‌త లేదు. అలాగే, మంకీపాక్స్ కు కొత్త‌పేరును ప‌రిశీలిస్తున్న‌ట్టు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ వ‌ర్గాలు పేర్కొన్నాయి. టీకాల విష‌యంలో క‌లిసిముందుకు సాగ‌టం కీల‌క‌మైన అంశ‌మ‌ని WHO తెలిపింది. మశూచి వ్యాక్సిన్‌లు ఫ‌లితం చూపిస్తున్నాయ‌ని పేర్కొంది.