ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీపై మరో హత్యాప్రయత్నం జరిగింది. రష్యన్ స్పెషల్ సర్వీసెస్ సారథ్యంలో 25 మందితో కూడిన మిలిటరీ బృందాన్ని స్లోవేకియా హంగరి సరిహద్దులో పట్టుకున్నట్టు కీవ్ పోస్టు అనే మీడియా సంస్థ ట్వీట్ చేసింది. జెలెన్‌స్కీని భౌతికంగా నిర్మూలించడమే ఆ బృంద లక్ష్యం అని పేర్కొంది.
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీపై మరోసారి హత్యాప్రయత్నం జరిగింది. కానీ, అధికారులు ఆ ప్రయత్నాన్ని ముందుగానే పసిగట్టారు. జెలెన్‌స్కీని హత్య చేయాలనే పథకంతో బయల్దేరిన 25 మందిని స్లోవేకియా- హంగేరి సరిహద్దులో కీవ్ బలగాలు అదుపులోకి తీసుకున్నట్టు కీవ్ పోస్టు మీడియా సంస్థ వెల్లడించింది.రష్యన్ స్పెషల్ సర్వీసెస్ సారథ్యంలో ఈ 25 మంది బయల్దేరినట్టు వివరించింది.
కీవ్ పోస్టు మీడియా సంస్థ ఈ మేరకు ట్వీట్ చేసింది. జెలెన్‌స్కీ ప్రాణాలు తీయాలనే మరో ప్రయత్నం విఫలం అయిందని వివరించింది. ఈ సారి రష్యన్ స్పెషల్ సర్వీసెస్ సారథ్యంలో 25 మందితో కూడిన మిలిటరీ బృందాన్ని స్లోవేకియా హంగరీ బార్డర్‌లో అదుపులోకి తీసుకున్నట్టు తెలిపింది. జెలెన్‌స్కీని భౌతికంగా నిర్మూలించడమే ఆ బృందం లక్ష్యం అని పేర్కొంది.
మార్చి 4వ తేదీన ది టైమ్స్ ఇలాంటి ప్రయత్నాలపైనే ఓ కథనం ప్రచురించింది. జెలెన్‌స్కీ అప్పటికే మూడు హత్యా ప్రయత్నాలను తప్పించుకున్నట్టు పేర్కొంది.
అప్పటి వరకే ఆయనపై మూడు సార్లు హత్యా ప్రయత్నాలు జరిగాయని తెలిసింది. మరో షాకింగ్ న్యూస్ ఏమంటే.. ఆ హత్యా ప్రయత్నాలను నిలువరించడానికి కూడా రష్యా ఇంటెలిజెన్స్‌లోని కొన్ని వర్గాల నుంచే అందిందని సమాచారం.
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ప్రారంభం అయినప్పటి నుంచి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై మూడు సార్లు హత్యా ప్రయత్నాలు(Murder Attempt) జరిగాయని వాషింగ్టన్ పోస్టు పేర్కొంది. వొలొడిమిర్ జెలెన్‌స్కీని చంపేయడానికి రెండు గ్రూపులు వాగ్నర్ గ్రూప్, చెచెన్ రెబెల్స్‌ను పురమాయించినట్టు సమాచారం.
అయితే, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలొడిమిర్ జెలెన్‌స్కీని చంపేయడానికి బయల్దేరిన చెచెన్ గ్రూపు గురించి రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్(ఎఫ్ఎస్‌బీ)లోని కొన్ని వర్గాలే ఉక్రెయిన్ అధికారులను అప్రమత్తం చేసినట్టు వాషింగ్టన్ పోస్టు కథనం పేర్కొంది. అయితే, ఆ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్‌లో యుద్ధాన్ని వ్యతిరేకించేవారూ ఉన్నట్టు సమాచారం. ఆ వర్గాల నుంచే ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ హత్యాయత్నం గురించి సమాచారాన్ని లీక్ చేశారని తెలిసింది. ఈ సమాచారం అందగానే అధికారులు రంగంలోకి దిగారు. వొలొడిమిర్ జెలెన్‌స్కీ హత్య గురించి బయల్దేరిన చెచెన్ గ్రూపును నాశనం చేసినట్టు శనివారం రాజధాని కీవ్ నగర శివార్లలో ఈ బృందాన్ని అంతమొందించినట్టు ఉక్రెయిన్ నేషనల్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ కౌన్సిల్ సెక్రెటరీ ఒలెసక్సీ డానిలొవ్ వివరించారు.
వొలొడిమిర్ జెలెన్‌స్కీ హత్యకు బయల్దేరిన చెచెన్ గ్రూపులను శనివారం చంపేసినట్టు తెలిపారు. వీరి గురించి తమకు ఎఫ్ఎస్‌బీ నుంచే సమాచారం అందిందని, అందులోని కొన్ని యుద్ధ వ్యతిరేక మనుషుల నుంచి ఈ సమాచారం వచ్చిందని పేర్కొన్నారు. అదే విధంగా జెలెన్‌స్కీని హతమార్చాలని ప్రయత్నించిన వాగ్నర్ గ్రూపు కూడా ఉక్రెయిన్ అధికారులు తమ కదలికలను అంత కచ్చితంగా అంచనా వేయడంపై ఆందోళన చెందినట్టు సమాచారం. ఉక్రెయిన్ అధికారుల చాకచక్యం వాగ్నర్ గ్రూపులో కలకలం రేపినట్టు తెలిసింది.