ఓ మహిళ తన భర్తను చంపింది. దుఃఖం అనే విషయంలో పిల్లల కోసం పుస్తకం రాసింది. ఆమె భర్త మరణంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తులో సంచలన విషయాలు గుర్తించారు. భార్యే.. భర్తను చంపిందని, అంతకు ముందు పలు సందేహాలను గూగుల్ లో సెర్చ్ చేసిందని  తెలుసుకున్నారు. 

తన భర్తను చంపి, దుఃఖం గురించి పిల్లల పుస్తకం రాసి ఇటీవల వార్తల్లో నిలిచిన అమెరికా మహిళ కౌరీ రిచిన్స్.. ఈ దారుణానికి ముందు గూగుల్ లో తన అనేక సందేహాలకు సమాధాలను కనుగొనే ప్రయత్నం చేసింది. ‘ధనవంతుల కోసం లగ్జరీ జైళ్లు, జీవిత బీమా కంపెనీలు క్లైయిమ్ చెల్లించడానికి ఎంత సమయం పడుతుంది’’ అనే విషయాలపై విస్తృతంగా గూగుల్ లో సెర్చ్ చేశారు.

వాషింగ్టన్ - న్యూయార్క్ కు ట్రక్ రైడ్ ను ఆస్వాదించిన రాహుల్ గాంధీ.. భారతీయ ట్రక్ డ్రైవర్ తో సుధీర్ఘ సంభాషణ

వార్తా సంస్థ కేటీవీఎక్స్ ప్రకారం.. ముగ్గురు పిల్లల తల్లి అయిన 33 ఏళ్ల కౌరీ రిచిన్స్ తన భర్త ఎరిక్ రిచిన్స్ కు 2022 మార్చిలో ఫెంటానిల్ ప్రాణాంతక మోతాదుతో విషమిచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే అంతకు ముందు ఆమె గూగుల్ లో ఉటా శిక్షలు, అలాగే అమెరికాలో సంపన్నుల కోసం విలాసవంతమైన జైళ్లు వంటి సమాచారం కోసం శోధించారు. వీటితో పాటు డిలీట్ చేసిన సందేశాలను పరిశోధకులు చూడగలరా? జీవిత బీమా కంపెనీలు క్లెయిందారులకు చెల్లించడానికి ఎంత సమయం తీసుకుంటాయి ? లై డిటెక్టర్ పరీక్ష చేయమని పోలీసులు మనల్ని బలవంతం చేయగలరా ? మరణ ధృవీకరణ పత్రంపై మరణానికి కారణాన్ని మార్చవచ్చా? అని ఆమె వెబ్ లో సెర్చ్ చేశారు.

వార్నీ.. తప్పతాగి రైల్వే ట్రాక్ పై పడుకున్న యువకుడు.. రైలు దిగి నిద్రలో నుంచి లేపిన లోకో పైలట్

‘‘ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న సంకేతాలు’’ అనే శీర్షికతో ఒక కథనాన్ని, ‘‘మరణానికి పెండింగ్ కారణంతో డెత్ సర్టిఫికేట్ కోసం క్లెయిమ్ చెల్లింపులో జాప్యం’’ అనే శీర్షికతో ఒక కథనాన్ని కూడా అని కూడా ఆమె చదివింది. ఆమె ఇతర శోధనలలో ‘‘నలోక్సోన్ హెరాయిన్ ను పోలి ఉందా ? కౌరి రిచిన్స్ కామాస్ నికర విలువ’’అనే ప్రశ్నలు ఉన్నాయి. అయితే సోమవారం డిటెన్షన్ విచారణకు హాజరైన సందర్భంగా ఆమె గూగుల్ సెర్చ్ వివరాలు బయటకు వచ్చాయి. అక్కడ న్యాయమూర్తి ఆమెను సమాజానికి గణనీయమైన ప్రమాదం అని పేర్కొంటూ జైలులోనే ఉండాలని ఆదేశించారు. 

కేరళలో రోజ్ గార్ మేళాను ప్రారంభించిన కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్

ఎరిక్ రిచిన్స్ మరణం ఎలా వెలుగులోకి వచ్చిందంటే ? 
నిందితురాలు రిచిన్స్ 2022 మార్చిలో ఓ రోజు అర్థరాత్రి పోలీసులకు ఫోన్ చేసింది. తన భర్త ఎరిక్ రిచిన్స్ ఎలాంటి స్పర్శ లేకుండా పడి ఉన్నాడని చెప్పినట్టు ‘బీబీసీ’ తెలిపింది. అయితే తన భర్తకు తాను మిక్స్ డ్ వోడ్కా డ్రింక్ ఇచ్చానని, కొన్ని గంటల తర్వాత అతడు స్పందించడం లేదని ఆమె అధికారులకు తెలిపింది. ఫెంటానిల్ అధిక మోతాదు కారణంగా రిచిన్స్ మరణించినట్లు మెడికల్ ఎగ్జామినర్ తరువాత కనుగొన్నారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. దీంతో ఈ విషయాలు అన్నీ బయటకు వచ్చాయి.