Asianet News TeluguAsianet News Telugu

AIDS: హెచ్ఐవీకి విరుగుడు కనిపెట్టిన శాస్త్రవేత్తలు

హెచ్ఐవీకి డచ్ శాస్త్రవేత్తలు విరుగుడు కనిపెట్టారు. సీఆర్ఐఎస్పీఆర్ అనే సాంకేతికత పరిజ్ఞానంతో హెచ్ఐవీని పూర్తిగా నయం చేయవచ్చని చెప్పారు.
 

amsterdam university scientists finds crispr technology to cure HIV kms
Author
First Published Mar 22, 2024, 3:50 PM IST | Last Updated Mar 22, 2024, 3:50 PM IST

HIV: హెచ్ఐవీ వల్ల ఇప్పటికీ గణనీయంగా రోగులు మరణిస్తున్నారు. నియంత్రణ తప్పితే నయం లేని ఈ మహమ్మారికి డచ్ శాస్త్రవేత్తలు విరుగుడు కనిపెట్టారు. CRISPR అనే టెక్నాలజీతో హెచ్ఐవీకి చికిత్స చేసే మార్గాన్ని కనుగొననారు. 

ఆమ్‌స్టర్ డ్యామ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం హెచ్ఐవీని నయం చేయడానికి అనేక విధాల పరిశోధనలు చేశారు. ఈ క్రమంలో వారు సీఆర్ఐఎస్పీఆర్ అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని కనుగొని సంచలన విజయాన్ని సాధించారు. ఈ టెక్నాలజీనే మాలిక్యులర్ కటింగ్ అని కూడా పిలుస్తారు. హెచ్ఐవీ వైరస్ సోకిన కణాల డీఎన్ఏను ఈ టెక్నాలజీ ద్వారా తొలగిస్తారు.

అయితే, ఇది ఇప్పటికిప్పుడే తక్షణ ఫలితాలను ఇస్తుందని చెప్పలేమని, హెచ్ఐవీకి విరుగుడు కనిపెట్టడంలో ఇది ఆరంభంగా పరిగణించాలని ఆమ్‌స్టర్ డ్యాం యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ సాంకేతికత ద్వారా రోగి ఎంత సురక్షితంగా ఉంటున్నాడు? ఈ చికిత్స ఎంత సమర్థంగా, ప్రభావవంతంగా పని చేస్తున్నదని తెలుసుకోవడానికి పరిశోధనలు జరుగుతున్నాయి.

హెచ్ఐవీకి సీఆర్ఐఎస్పీఆర్ చికిత్స ఎంత వరకు సమర్థవంతంగా, ప్రభావవంతంగా ఉన్నదో రివ్యూ చేసుకోవడం చాలా ముఖ్యమని నాటింగ్ హాం యూనివర్సిటీ, స్టెమ్ సెల్-జీన్ థెరపీ టెక్నాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జేమ్స్ డిక్సన్ అన్నారు. ఇది అద్భుతమైన ముందడుగే అయినప్పటికీ దీనిపై అధ్యయనం అవసరం అని వివరించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios