Asianet News TeluguAsianet News Telugu

గ్రహాంతరవాసులు నిజంగా ఉన్నాయా? అమెరికా కాంగ్రెస్ బహిరంగ విచారణ

గ్రహాంతరవాసులు నిజంగా ఉన్నాయా? అనే సందేహం అందరిలోనూ ఉన్నది. ఎగిరే పళ్లాలకు సంబంధించి అమెరికా కాంగ్రెస్ బహిరంగ చర్చ చేస్తున్నది. అమెరికా భద్రత కోణంలో ఈ ఎగిరే పళ్లాలపై అమెరికా రక్షణ నిఘా అధికారులు వీటిపై సమాధానాలు ఇవ్వనున్నారు.
 

america congress debates on UFOs
Author
New Delhi, First Published May 17, 2022, 7:13 PM IST

న్యూఢిల్లీ: గ్రహాంతరవాసులు నిజంగా ఉన్నాయా? లేవా? అనే చర్చ ఎడతెగనిది. ప్రపంచ దేశాల్లో పలుచోట్ల పలువురు ఎగిరే పళ్లాలు (యూఎఫ్‌వో) చూసినట్టు చెప్పారు. అమెరికా నిఘా వర్గాలు కూడా ఇలాంటి గుర్తు తెలియని వస్తువులను చూసినట్టు పేర్కొన్నాయి. కానీ, వాటిపై సాధికారిక చర్చ జరగలేదు. నిఘా వర్గాలు కూడా వీటిని రికార్డు చేసినట్టు రిపోర్టులు పేర్కొన్నాయి. కానీ, ఆ గుర్తు తెలియని ఎగిరే పళ్లాలకు గ్రహాంతరవాసులకు మధ్య సంబంధాలు ఉన్నట్టు ఆధారాలు సేకరించలేకపోయినట్టు అధికారులు స్పష్టం చేశారు. ఈ తరుణంలో సుమారు 50 ఏళ్ల తర్వాత మళ్లీ తొలిసారి అమెరికా కాంగ్రెస్ బహిరంగ చర్చ జరుపుతున్నది.

అమెరికా మిలిటరీ పైలట్లు 2014 నుంచి ఇలాంటి గుర్తు తెలియని వస్తువులను 140 కేసులను రిపోర్ట్ చేసింది. వీటితోపాటు మరిన్ని రిపోర్టులు అమెరికా నిఘా వర్గాలు, భద్రతా వర్గాల దగ్గర ఉన్నాయి. వీటిపై ఇద్దరు అమెరికా రక్షణ శాఖ నిఘా అధికారులు సమాధానాలు ఇస్తారు. అమెరికా కాంగ్రెస్ బహిరంగ చర్చకు ముందు ఈ రిపోర్టులపై అంతర్గత సమావేశం ఒకటి ఉంటుంది.

అమెరికా అంతర్గత భద్రత, ఇతర ముప్పు ఎదుర్కోకుండా జాగ్రత్తలు తీసుకోవాలనే కోణంలోనే ఈ చర్చను అమెరికా కాంగ్రెస్ చేపడుతున్నది. అంతేకానీ, గ్రహాంతరవాసులపై ప్రత్యేక చర్చ చేయడం లేదు. 

యూఎఫ్‌వో గురించిన వదంతులు ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఎందుకుంటే అందుకు సంబంధించి నిర్దిష్టమైన ఫొటోలు చాలా తక్కువ. కానీ, తాము చూశామన్న వాదనలే ఎక్కువ. అయితే, ఇందుకు భిన్నంగా 50 ఏళ్ల క్రితం తీసిన ఓ ఫొటో ఇప్పటి వరకు యూఎఫ్‌వోల చిత్రాల్లో ఎక్కువ క్లారిటీతో ఉన్నదని పేర్కొంటున్నారు. ఆ బెస్ట్ యూఎఫ్‌వో ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఆ ఫొటోను చాలా మీడియా సంస్థలు ప్రచురించాయి. ఇప్పటి వరకు యూఎఫ్‌వోలను అత్యంత క్లారిటీగా తీసిన ఫొటో ఇదేనని యూజర్లు పేర్కొంటున్నారు. ఈ ఫొటోను సెర్జియో లొయాజా 1971 సెప్టెంబర్‌లో తీశాడు. కోస్టారికా తీరంలో ఓ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కోసం సర్వే చేస్తూ ఓ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఎగురుతూ ర్యాండమ్‌గా తీసిన ఫొటోల్లో ఇదీ ఒకటి.

కింద ఉన్న సరస్సుకు పది వేల అడుగుల ఎత్తు నుంచి హై రిజల్యూషన్ ఫొటోలు అనేకం తీశాడు. అందులో ఓ ఫొటోలో ఈ గుర్తు తెలియని వస్తువు కనిపించింది. ఈ ఫొటోను ఎన్‌హాన్స్ చేయగానే ఆ గుర్తు తెలియని వస్తువు మరింత స్పష్టంగా కనిపించింది.

అయితే, ఆ ఫొటో నేషనల్ జియోగ్రాఫిక్ కొస్టారికాకు ప్రాపర్టీ. ఆ సర్వే చేపట్టాలని ఆదేశించినది ఇదే. ఆ ఫొటోను ఇప్పుడు ఓ వ్యక్తి సంపాదించి సోషల్ మీడియాలో వదిలాడు.

Follow Us:
Download App:
  • android
  • ios