Asianet News TeluguAsianet News Telugu

TIME: టైమ్ 100 మంది ప్రభావశీలురుల్లో ఉగ్రవాది

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సీరం సంస్థ సీఈవో అదర్ పూనావాల, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాద్యక్షురాలు కమలా హారిస్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లతోపాటు తాలిబాన్ నేత కూడా ఈ ఏడాది టైమ్ ప్రభావశీలుర జాబితాలో చోటుదక్కించుకున్నారు. 
 

along with dominant world leaders taliban leader baradar in time 100 influential people list
Author
New Delhi, First Published Sep 16, 2021, 12:31 PM IST

న్యూఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ వంద మంది ప్రభావశీలుర జాబితా(2021) విడుదల చేసింది. ఇందులో విచిత్రంగా ఓ ఉగ్రవాది, ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వానికి ఉపప్రధాని ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్‌కు చోటుదక్కింది. తాలిబాన్‌లలో మాడరేటర్‌గా కనిపించే బరాదర్ రహస్యంగా, గుంబనంగా ఉండి అరుదుగా ప్రకటనలు ఇస్తారని టైమ్ పేర్కొంది. పాశ్చాత్య దేశాల మద్దతుకు, అంతర్జాతీయ ఆర్థిక సహాయాన్ని పొందడానికి తాలిబాన్ల నుంచి ఈయన వెలుగులోకి వచ్చారని వివరించింది.

తాజా టైమ్ జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కరోనా టీకా తయారీదారు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాల పేర్లున్నాయి. 74ఏళ్ల స్వతంత్ర భారతంతో జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీల తర్వాత నరేంద్ర మోడీ కీలక నేతగా వెలుగొందుతున్నారని టైమ్ ప్రొఫైల్ పేర్కొంది. దేశాన్ని సెక్యూలరిజం నుంచి హిందూ జాతీయవాదం వైపు తీసుకెళ్తున్నారని సీఎన్ఎన్ జర్నలిస్టు రాసిన ప్రొఫైల్ తెలిపింది. భారత దేశ రాజకీయాల్లో బలమైన శక్తిగా మమతా బెనర్జీ ఆవిర్భవించారని టైమ్ వివరించింది.

వీరితోపాటు ఇతర దేశాల నుంచి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ప్రిన్స్ హ్యారీ, ఆయన సతీమణి మేఘన్, అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌లూ ఉన్నారు. రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ, టెన్నిస్ ప్లేయర్ నోవామీ ఒసాకా, మ్యూజిక్ ఐకాన్ బ్రిట్నీ స్పియర్స్, ఆపిల్ సీఈవో టిమ్ కుక్, నటి కేట్ విన్‌స్లెట్‌లున్నారు. వీరందరి సరసన తాలిబాన్ నేత బరాదర్ ఉండటం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios