Asianet News TeluguAsianet News Telugu

Putin: భర్త చనిపోయాక ‘ఐ లవ్ యూ’ అంటూ అలెక్సీ నావల్నీ భార్య పోస్ట్

పుతిన్ విమర్శకుడు అలెక్సీ నావల్నీ మరణించిన తర్వాత ఆయన భార్య యూలియా నావల్నీ తొలిసారి ఇన్‌స్టాలో పోస్టు చేశారు. ఐ లవ్ యూ అంటూ క్యాప్షన్ పెట్టారు.
 

alexei navalny wife yulia navalny first post after his death kms
Author
First Published Feb 19, 2024, 1:42 AM IST | Last Updated Feb 19, 2024, 1:42 AM IST

Putin: రెండు దశాబ్దాలుగా వ్లాదిమిర్ పుతిన్ అధికార పీఠంపై ఉన్నారు. 2000 నుంచి ఇప్పటి వరకు రష్యా అధ్యక్షుడిగా కొసాగుతన్నారు. మధ్యలో నాలుగేళ్లు ప్రధానిగా పని చేశారు. పుతిన్ విధానాలను, ఆయన పాలనపై తరుచూ విమర్శలు చేసేవాడు అలెక్సీ నావల్నీ. రష్యా లోపలా బయటా పుతిన్‌పై బహిరంగంగా తీవ్ర విమర్శలు చేయగల సాహసం నావల్నీ ఒక్కడే చేశాడు. ఆయనపై అనేక రూపాల్లో హత్యా ప్రయత్నాలు జరిగినట్టు వార్తలు వచ్చాయి. అయితే.. మొన్న ఆయన పీనల్ కాలనీలో శిక్ష అనుభవిస్తూనే మరణించాడు.

అలెక్సీ నావల్నీ భార్య యూలియా నావాల్నీ. భర్త చనిపోగానే రోధించింది. నావల్నీ ఆలోచనలతో ఏకీభవించేవారు ఆమెకు అండగా నిలిచారు. ఓదార్పు వ్యాఖ్యలు చెప్పారు. భర్త చనిపోయాక మొదటి సారి నావల్నీ మళ్లీ సోషల్ మీడియాలో కనిపించింది. భర్తతో కలిసి ఓ ఫర్మార్మెన్స్ షో చూస్తున్నప్పటి ఫొటోను షేర్ చేసింది. ఐ లవ్ యూ అంటూ పోస్టు పెట్టింది.

Also Read : Madhya Pradesh: కమల్ నాథ్ బీజేపీకి వెళ్లడం లేదా? కాంగ్రెస్ పార్టీ ఏమంటున్నది?

ఈ పోస్టుపై అనేక వ్యాఖ్యలు వచ్చాయి. ఆమెకు ధైర్యవచనాలు చెప్పారు. ఆమె తన ధైర్యాన్ని కోల్పోవద్దని ఓదార్చారు. నావల్నీ స్పిరిట్‌ను కొనసాగించాలని మరికొందరు పేర్కొన్నారు. ఈ పాడు ప్రపంచంలో కంటే నావల్నీ మంచి ప్రపంచంలోనే ఉన్నాడని అనుకుంటున్నట్టు మరొకరు కామెంట్ చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios