Asianet News TeluguAsianet News Telugu

Alaska Airlines: విమానం గాల్లో ఉండగానే ఇంజన్ ఆఫ్..  మరో పైలట్ అప్రమత్తం.. 80 మంది సేఫ్..

Alaska Airlines:  ఆఫ్-డ్యూటీ పైలట్ విమానం మధ్యలో విమానం ఇంజిన్‌లను మూసివేయడానికి ప్రయత్నించాడు. దీంతో ప్రధాన పైలట్ అప్రమత్తం కావడంతో 80 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానాన్ని ఒరెగాన్‌లోని పోర్ట్‌ల్యాండ్‌కు మళ్లించి.. సురక్షితంగా ల్యాండ్ చేయబడింది.

Alaska Airlines says An off-duty pilot attempted to shut off the engines in flight KRJ
Author
First Published Oct 24, 2023, 6:50 AM IST | Last Updated Oct 24, 2023, 6:50 AM IST

Alaska Airlines:  యుఎస్ కమర్షియల్ ఫ్లైట్‌లో ఆఫ్ డ్యూటీలో ఉన్న ఓ పైలట్ చేసిన నిర్వాకం భయాందోళనకు గురి చేసింది. దాదాపు 80 మంది ప్రాణాల మీదికి  వచ్చింది. ఈ తరుణంలో మెయిన్ ఫైలట్ అప్రమత్తం కావడంతో ఘోర ప్రమాదం తప్పింది. వారందరూ సెఫ్ గా ల్యాండ్ అయ్యారు. అసలేం జరిగిందంటే..  
 
మీడియా నివేదికల ప్రకారం.. యుఎస్ కమర్షియల్ ఫ్లైట్‌ హారిజోన్ ఎయిర్ ఎంబ్రేయర్ E-175 విమానం వాషింగ్టన్‌లోని ఎవెరెట్ నుండి శాన్ ఫ్రాన్సిస్కోకు వెళుతుంది. ఇందులో  80 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అందులో ఆఫ్ డ్యూటీ లో అలాస్కా ఎయిర్‌లైన్స్ పైలట్ జోసెఫ్ ఎమర్సన్ (44) కూడా ఉన్నాడు. ఈ సమయంలో ఆ ఫైలట్ ఇంజిన్‌ను షట్ డౌన్ చేయడానికి ప్రయత్నించినట్టు అలస్కా ఎయిర్‌లైన్స్ తెలిపింది. 

పైలట్ ఇంజిన్‌ను షట్ డౌన్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ అతని ప్రయత్నం ఫలించలేదు. హారిజన్ కెప్టెన్,  ఫస్ట్ ఆఫీసర్ వెంటనే స్పందించారు. వెంటనే విమానాన్ని ఒరెగాన్‌లోని పోర్ట్‌ల్యాండ్‌కు మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశాడు. విమానయాన సంస్థ ఆఫ్-డ్యూటీ పైలట్‌ను గుర్తించలేదు. 

సోమవారం నాడు పోర్ట్‌ల్యాండ్‌లోని ముల్ట్‌నోమా కౌంటీ షెరీఫ్ కార్యాలయం ఎమర్సన్‌పై హత్యాయత్నం, నిర్లక్ష్యంగా ప్రమాదంలో పడటం వంటి ఆరోపణలపై కేసు నమోదు చేసింది. హారిజన్ ఎయిర్ ఎంబ్రేయర్ E-175 విమానం వాషింగ్టన్‌లోని ఎవెరెట్ నుండి శాన్ ఫ్రాన్సిస్కోకు వెళుతుండగా ఆదివారం ఈ సంఘటన జరిగినట్లు హారిజన్ మాతృ సంస్థ అలస్కా ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios