ఉగ్రవాద సంస్థ ఆల్ ఖైదా యోమెన్ చీఫ్ ఖాసీం ఆల్ రిమీ హతమైనట్లు అమెరికా ప్రకటించింది. తమ దేశ నావికా దళ అధికారులను బలి తీసుకున్నందుకు గాను అతడిని మట్టుబెట్టినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.  యెమెన్ లో హింసకు కారణమైన అత్యంత ప్రమాదకర వ్యక్తిని అంతమొందించినట్లు వెల్లడించింది. ఉగ్రవాద నిర్మూలన చర్యల్లో భాగంగా ఆల్ ఖైదా ఇన్ అరేబియన్ పెనిసులా కార్యకలాపాలను అడ్డుకునేందుకు ఈ ఆపరేషన్ నిర్వహించామని ట్రంప్ చేశారు. 

Also Readహిస్టరీ... నిర్దోషిగా నిరూపించుకున్న ట్రంప్...

ఈ మేరకు ట్రంప్ ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో ‘ రిమీ నేతృత్వంలో ఏక్యూఏపీ యెమెన్ లో తీవ్ర హింస చెలరేగింది. ఎంతో మంది పౌరులను బలిగొన్నారు. ఇప్పుడు అమెరికా పౌరులు, అమెరికా బలగాలపై దాడులు చేసేందుకు ఆ సంస్థ ప్రణాళికలు రచించింది. అందుకే ఉగ్రవాద నిర్మూలన చర్యల్లో భాగంగా యెమెన్ లోచేపట్టిన ఆపరేషన్ లో ఏక్యూఏపీ వ్యవస్థాపకుడు ఖాసీం ఆల్-రిమీని అంతమొందించాం. అతడి చావుతో ఏక్యూఏపీ, ఆల్-ఖైదా ఉద్యమం నీరుగారుతోంది. ఇలాంటి ఉగ్రసంస్థల వల్ల మా జాతీయ భద్రతకు భంగం వాటిల్లకుండా ఉంటుంది’ అని ట్రంప్ పేర్కొన్నారు.

కాగా... గతేడాది డిసెంబరు 6న ఫ్లోరిడాలోని పెన్సాకోలా వద్ద ఉన్న నావల్‌ ఎయిర్‌ స్టేషన్‌పై ఓ సౌదీ అధికారి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడగా... ముగ్గురు అమెరికా సెయిలర్లు మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో ఘటనకు బాధ్యత వహిస్తూ ఏక్యూఏపీ ముందుకువచ్చింది.