Asianet News TeluguAsianet News Telugu

లిబియాలో వైమానిక దాడి..40మంది మృతి

లిబియాలో వైమానిక దాడి జరిగి 40మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా మరో 80 మంది తీవ్రంగా గాయపడ్డారు. దేశ రాజధాని ట్రిపోలి నగర శివారులోని తజౌరా అనే ప్రాంతంలో ఉన్న వలసదారుల పునరావాస కేంద్రంపై మంగళవారం రాత్రి ఈ దాడి చేశారు. 

Airstrike hits migrant detention center in Libya, 40 killed
Author
Hyderabad, First Published Jul 3, 2019, 9:25 AM IST


లిబియాలో వైమానిక దాడి జరిగి 40మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా మరో 80 మంది తీవ్రంగా గాయపడ్డారు. దేశ రాజధాని ట్రిపోలి నగర శివారులోని తజౌరా అనే ప్రాంతంలో ఉన్న వలసదారుల పునరావాస కేంద్రంపై మంగళవారం రాత్రి ఈ దాడి చేశారు. వసలదారులను లక్ష్యంగా చేసుకునే ఈ దాడి జరిగినట్లు అధికారులు గుర్తించారు.

మృతుల్లో చాలా మందిని అఫ్రికా వలసదారులుగా గుర్తించారు. దాడి సమయంలో కేంద్రంలో దాదాపు 120 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. దాడి తీవ్రత భారీ స్థాయిలో ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించారు. 

దాడికి పాల్పడింది ఎవరు అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. లిబియా దేశాధినేత గడాఫీని 2011లో హతమార్చిన నాటి నుంచి ఆ దేశంలో హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ఐరాస గుర్తించిన ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న వర్గం ఎల్‌ఎన్‌ఏగా ఏర్పడి తరచూ హింసకు పాల్పడుతోంది. అధికారిక ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా పోరాటం సాగిస్తోంది.  
 

Follow Us:
Download App:
  • android
  • ios