Asianet News TeluguAsianet News Telugu

రిషి సునాక్ ఓటమి.. యూకే హోం మంత్రి ప్రీతి పటేల్ రాజీనామా.. బోరిస్ జాన్సన్‌కు బహిరంగ లేఖ

యూకే పీఎం రేసులో భారత సంతతి నేత రిషి సునాక్ ఓడిపోయాడు. లిజ్ ట్రస్ గెలిచిన గంటల వ్యవధిలోనే యూకే హోం మంత్రి ప్రీతి పటేల్ రాజీనామా చేశారు. అదే విధంగా ప్రధానిగా దిగిపోతున్న బోరిస్ జాన్సన్‌కు ఓ బహిరంగ లేఖ రాశారు.
 

after liz truss win as UK PM, priti patel resigns
Author
First Published Sep 5, 2022, 11:59 PM IST

న్యూఢిల్లీ: భారత సంతతి రిషి సునాక్ యూకే ప్రధాని రేసులో పోటీ చేశారు. బోరిస్ జాన్సన్‌పై ఆరోపణలు తీవ్రం కావడం, మంత్రులు, పార్టీ చట్ట సభ్యులు, నేతలు వరుసగా రాజీనామాలు చేస్తూ జాన్సన్ రాజీనామా చేయాలని డిమాండ్లు చేసిన సంగతి తెలిసిందే. ఈ డిమాండ్లతో బోరిస్ జాన్సన్ రాజీనామా చేసినా.. ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతున్నారు. అనంతరం, కన్జర్వేటివ్ పార్టీ నేతగా రిషి సునాక్‌పై లిజ్ ట్రస్ ఘన విజయం సాధించారు. మంగళవారం ఆమె ప్రధానిగా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉన్నది. ఇదంతా జరుగుతుండగా.. యూకే హోం మంత్రి ప్రీతి పటేల్ షాక్ ఇచ్చారు. ఆమె తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అలాగే, ఔట్‌గోయింగ్ పీఎం బోరిస్ జాన్సన్‌కు బహిరంగ లేఖ రాశారు. 

రిషి సునాక్ గెలవొద్దని బోరిస్ జాన్సన్‌కు బలంగా ఉండేది. సునాక్ గెలవకుండా అడ్డుకోవడానికి జాన్సన్ వీలైనంతగా కష్టపడటానికి సిద్ధంగా ఉన్నారని గతంలో ఓ కథనం పేర్కొంది.

అయితే, టోరీ పార్టీ నేతగా మేరీ ఎలిజబెత్ ట్రస్ (లిజ్ ట్రస్) గెలుపొందారు. ఆమె 80 వేల పైచిలుకు ఓట్లు సాధించగా.. రిషి సునాక్ 60 వేలకు పైగా ఓట్లు గెలుపొందారు. లిజ్ ట్రస్ గెలిచిన గంటల వ్యవధిలోనే హోం మంత్రిగా ప్రీతి పటేల్ రాజీనామా చేశారు. తాను కొత్త ప్రధానమంత్రి లిజ్ ట్రస్‌కు పూర్తిగా మద్దతు ఇస్తానని ఆమె తెలిపారు. దేశ ప్రజలకు, విథామ్ నియోజకవర్గానికి వెనుక బెంచీల్లో కూర్చుని సేవలు అందించాని భావించే అవకాశం తనకు ఉన్నదని ఆ లేఖలో ప్రీతి పటేల్ పేర్కొన్నారు. కాబట్టి, లిజ్ ట్రస్ అధికారికంగా ప్రధాని కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్న తర్వాత కొత్త హోం మంత్రిని నియమించుకుంటారని భావిస్తున్నట్టు వివరించారు. 

బోరిస్ జాన్సన్ హయాంలో తీసుకున్న చారిత్రక నిర్ణయాలు, సంస్కరణలు, అభివృద్ధి వైపు తీసుకున్న నిర్ణయాలను ఆమె ఆ బహిరంగ లేఖలో చర్చించారు. బోరిస్ జాన్సన్ నాయకత్వంతో దేశానికి హోం మంత్రిగా సేవలు అందించే సౌభాగ్యం దక్కినందుకు సంతోషంగా ఉన్నదని వివరించారు. 2019లో ఆయన ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నప్పటి గడ్డు పరిస్థితులను ఆమె ప్రస్తావించారు. వాటిని దిగ్విజయంగా ఆయన పరిష్కరించారని తెలిపారు. బ్రెగ్జిట్ కూడా సాధ్యం కావడానికి చాలా ప్రణాళిక ప్రకారం చేపట్టినట్టు బోరిస్ జాన్సన్‌పై ప్రశంసలు కురిపించారు.

Follow Us:
Download App:
  • android
  • ios