తాలిబన్లపై  ఆఫ్ఘనిస్తాన్ వైఎస్ ప్రెసిడెంట్ నేతృత్వంలో తిరుగుబాటు మొదలైంది. తాలిబన్లకు  ఆఫ్ఘనిస్తాన్ సైన్యం షాకిచ్చింది.  తాలిబన్ల ఆధీనంలో ఉన్న చారికర్ ప్రాంతాన్ని ఆఫ్ఘన్ సైన్యం తిరిగి తమ వశం చేసుకొంది.

 కాబూల్:ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లకు ఎదురుదెబ్బ తగిలింది. ఆఫ్ఘనిస్తాన్ ఉపాధ్యక్షుడు సలేహో నేతృత్వంలోని ఆ దేశ సైన్యం పర్వాన్ ప్రావిన్స్‌లోని చారికర్ ప్రాంతాన్ని తాలిబన్ల నుండి తిరిగి స్వాధీనం చేసుకొన్నారు. పంజిషేర్ జార్జ్ ప్రాంతంలో ప్రస్తుతం తాలిబన్లు, ఆఫ్ఘన్ సైన్యానికి మధ్య యుద్ధం సాగుతోందని తెలుస్తోంది. ఆఫ్ఘన్ ఆర్మీ అధికారులు ఈ విషయాన్ని ప్రకటించారు.

also read:దేశం వీడేందుకు ప్రాణాలకు తెగిస్తున్న ఆఫ్ఘన్లు.. ఒక్క విమానంలో 640 మంది, అదీ కింద కూర్చొని

రోడ్డు మార్గానికి చారికర్ ప్రాంతం అత్యంత ముఖ్యమైంది. చారికర్ ప్రాంతం సాలంగ్ టన్నెల్ మీదుగా కాబూల్ మజర్ ఏ షరీఫ్ ప్రాంతాన్ని కలుపుతుంది. ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలోని ఉత్తర భాగంలో చారికర్ ప్రాంతం అత్యంత కీలకమైంది.ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబన్లు స్వాధీనం చేసుకొన్న తర్వాత ఆ దేశాధ్యక్షుడు ఆష్రఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయాడు. సలేహ్ నేతృత్వంలో తాలిబన్లపై పోరాటం సాగిస్తున్నారు.

ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబన్లు స్వాధీనం చేసుకొన్న తర్వాత ఆ దేశవాసులు తీవ్ర భయాందోళనలతో జీవనం సాగిస్తున్నారు. దేశం విడిచివెళ్లేందుకు ప్రాణాలను సైతం కూడా లెక్క చేయడం లేదు. కాబూల్ విమానాశ్రయానికి విమానం వస్తే వందలాది మంది విమానం ఎక్కేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.