Asianet News TeluguAsianet News Telugu

‘నన్ను ఆఫీసునుంచి వెళ్లగొట్టారు.. మా ప్రాణాలకు ముప్పు ఉంది...’ ఆఫ్ఘన్ మహిళా న్యూస్ యాంకర్ వీడియో వైరల్...

తాలిబన్లు దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న తరువాత తనను టీవీ స్టేషన్ లో పనిచేయకుండా నిషేధం విధించారని చెబుతూ.. తమకు సాయం చేయాలని  వేడుకుంటూ ఆఫ్ఘన్ మహిళా జర్నలిస్ట్ ఒకరు ఓ వీడియోను ఆన్ లైన్ లో పోస్ట్ చేశారు. హిజాబ్ ధరించి తన ఆఫీస్ కార్డ్ చూపిస్తూ, ప్రముఖ న్యూస్ యాంకర్ షబ్నమ్ దావ్రాన్ సోషల్ మీడియాలో క్లిప్‌లో "మా ప్రాణాలకు ముప్పు ఉంది" అని ఆమె తెలిపింది.

Afghan Woman News Anchor Barred From Work After Taliban Takeover
Author
Hyderabad, First Published Aug 20, 2021, 8:17 AM IST

కాబూల్ : ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్ల పాలన మొదలయ్యాక మహిళల పరిస్థితి దయనీయంగా మారిపోయింది. ఈ క్రమంలోనే మహిళలను ఉద్యోగాల్లో నిషేధం విధించబడుతోంది. ఈ మేరకు ఆఫ్గన్ లోని ఓ ప్రముఖ న్యూస్ యాంకర్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

తాలిబన్లు దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న తరువాత తనను టీవీ స్టేషన్ లో పనిచేయకుండా నిషేధం విధించారని చెబుతూ.. తమకు సాయం చేయాలని  వేడుకుంటూ ఆఫ్ఘన్ మహిళా జర్నలిస్ట్ ఒకరు ఓ వీడియోను ఆన్ లైన్ లో పోస్ట్ చేశారు. హిజాబ్ ధరించి తన ఆఫీస్ కార్డ్ చూపిస్తూ, ప్రముఖ న్యూస్ యాంకర్ షబ్నమ్ దావ్రాన్ సోషల్ మీడియాలో క్లిప్‌లో "మా ప్రాణాలకు ముప్పు ఉంది" అని ఆమె తెలిపింది.

1996 నుండి 2001 వరకు తాలిబాన్ పాలనలో, మహిళలు ప్రజా జీవితం నుండి మినహాయించబడ్డారు. బాలికలు పాఠశాలకు హాజరు కాలేదు. మహిళలకు వినోదం నిషేధించబడింది. క్రూరమైన శిక్షలు విధించబడ్డాయి. దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి దారితీసిన హత్యల క్రమంలో తాలిబన్లు మహిళా జర్నలిస్టులను కూడా లక్ష్యంగా చేసుకున్నారు.

ఊహించని పరిణామంగా దేశాన్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు.. ఆ తరువాత మాట్లాడుతూ.. మహిళలకు విద్య, ఉపాధితో సహా సమాన హక్కులు ఉంటాయని, మీడియా స్వతంత్రంగా, స్వేచ్ఛగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని నొక్కి చెప్పడానికి ఒక తాలిబాన్ అధికారి ఓ టీవీలో మహిళా జర్నలిస్ట్‌తో వన్-టు-వన్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు.

కానీ ఆఫ్ఘనిస్తాన్‌ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆర్‌టిఎ బ్రాడ్‌కాస్టర్ లో కోసం ఆరు సంవత్సరాలు జర్నలిస్ట్‌గా పనిచేసిన దావ్రాన్, ఈ వారం ఆఫీసులోకి నిషేధించబడింది. తన మేల్ కొలీగ్స్ ను అనుమతించి.. తనను మాత్రం ఆఫీసులోకి రానివ్వలేదని, తమ మీద అప్రకటిత నిషేధం విదించినట్లు తెలిపారు.

"ఆఫ్గన్ లో వ్యవస్థ మారిన తర్వాత నేను ఉద్యోగం వదులుకోలేదు. ఎప్పటిలాగే ఆఫీసుకు వెళ్ళాను, కానీ నా ఆఫీస్ కార్డ్ చూపించినప్పటికీ దురదృష్టవశాత్తు నన్ను లోపలికి అనుమతించలేదు" అని ఆమె వీడియోలో పేర్కొంది.

తాలిబన్ల నీడలో జైషే, లష్కర్, హక్కానీ ముఠాలు.. ప్రపంచ భద్రతకు ముప్పే: విదేశాంగ మంత్రి జైశంకర్

"పురుష ఉద్యోగులు, ఆఫీసు కార్డులు ఉన్నవారు ఆఫీసులోకి అనుమతించబడ్డారు. కానీ, వ్యవస్థలోని మార్పుల కారణంగా నేను నా ఉద్యోగంలో ఇక మీదట కొనసాగలేనని నాకు వాళ్ళు చెప్పారు" అని దావ్రాన్ ఆవేదన వ్యక్తం చేసింది. దీంతోపాటు  దావ్రాన్ వీక్షకులతో ఇలా వేడుకుంది.. "ఈ వీడియో చూస్తున్నవారు. మా మాటలు వింటున్నవారు. ప్రపంచం.. మొత్తం.. మా ప్రాణాలకు ముప్పు ఉంది. దయచేసి మాకు సహాయం చేయండి." అంటూ అభ్యర్థించింది.

ఈ వీడియో ఫుటేజ్‌ను షేర్ చేసిన వారిలో ఆఫ్ఘనిస్తాన్‌లో 24 గంటల న్యూస్ ఛానెల్ అయిన టోలో న్యూస్‌ ఎడిటర్ మిరాకా పోపాల్ కూడా ఉన్నారు. ఆయన ఈ వీడియోను షేర్ చేస్తూ "@TOLOnews లో నా మాజీ సహోద్యోగి, ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేస్తున్న @rtapashto షబ్నమ్ దావ్రాన్ ఈ రోజు ఉద్యోగానికి అనర్హురాలిగా ప్రకటించబడింది. తాలిబన్లు ఆమెను నిషేదించారు" అని పోపాల్ బుధవారం ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇది వేలాదిగా షేర్లయ్యాయి.  

మంగళవారం ఒక ట్వీట్‌లో, టోలో న్యూస్‌ ఎడిటర్ పోపాల్ మహిళా న్యూస్ ప్రెజెంటర్ ఫొటో పోస్ట్ చేసారు, "మేము ఈ రోజు మహిళా యాంకర్‌లతో మా ప్రసారాన్ని తిరిగి ప్రారంభించాం." అని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios