అమెరికాలోని గ్రీన్స్‌బర్గ్‌లోని పాఠశాలలో జరిగిన కాల్పుల్లో ఒక విద్యార్థి మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. కాల్పుల ఘటన తర్వాత తరగతులు రద్దు చేశారు. సమాచారం ప్రకారం ఈ ఘటన లూసియానా హైస్కూల్‌లో చోటుచేసుకుంది. మృతులు, క్షతగాత్రుల వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. ఈ ఘటనకు సంబంధించి అనుమానాస్పద దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేశారు.
అమెరికాలో మరోసారి తుపాకుల మోత మోగింది. గ్రీన్స్‌బర్గ్‌లోని ఓ పాఠశాలలో కాల్పుల కలకలం రేగింది. పాఠశాలలో జరిగిన కాల్పుల్లో ఒక విద్యార్థి మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. సమాచారం ప్రకారం.. ఈ ఘటన లూసియానా హైస్కూల్‌లో చోటుచేసుకుంది. మృతులు, క్షతగాత్రుల వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి అనుమానాస్పద దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేశారు. అలాగే శుక్రవారం వరకు పాఠశాలకు సెలవులు ప్రకటించారు.
మంగళవారం నాటి కాల్పుల ఘటన తర్వాత అనుమానాస్పద దాడికి పాల్పడిన 14 ఏళ్ల విద్యార్థిని అరెస్టు చేశారు. ఘటన జరిగిన తర్వాత విచారణ ప్రారంభించారు. ఇది చాలా సున్నితమైన సంఘటన అని అధికారి తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాల్పులకు గల కారణాలు తెలియరాలేదని తెలిపారు. విచారణ తర్వాతే సమాచారం ఇవ్వగలమని చెప్పారు.
ఈ ఘటనపై గవర్నర్ జాన్ బెల్ ఎడ్వర్డ్స్ మాట్లాడుతూ..మంగళవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కాల్పులు జరిగినట్లు సమాచారం. ఈ ఘటన చాలా ఖండించదగినదనీ, ఇక్కడి ప్రజలు నా ఇంటికి, నా హృదయానికి దగ్గరగా ఉన్నారని ఆయన అన్నారు. ఎనిమిదేళ్లుగా తాను ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని అన్నారు.
రెచ్చిపోతోన్న గన్ కల్చర్
శుక్రవారం వరకు పాఠశాల తరగతులను రద్దు చేసినట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది. దీంతో పాటు క్రీడలకు సంబంధించిన సమావేశాలను కూడా రద్దు చేశారు. తుపాకీ సంస్కృతి మనందరినీ ప్రభావితం చేస్తుందని ఏరియా ప్రతినిధి ట్రాయ్ కార్టర్ ఈ ఘటనను ఖండించారు.
