Asianet News TeluguAsianet News Telugu

41యేళ్ల కిందటి కింగ్ ఛార్లెస్ వివాహం నాటి కేకు ముక్క వేలానికి..

రాజకుటుంబాలకు సంబంధించింది ఏదైనా ఆసక్తిగానే ఉంటుంది. అలాగే, ప్రస్తుత బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ 3 వివాహానికి సంబందించిన కేకు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

A piece of cake from the wedding of King Charles 41 years ago is up for auction In london
Author
First Published Oct 20, 2022, 7:13 AM IST

లండన్ :  బ్రిటన్ నూతన రాజు కింగ్ చార్లెస్ 3, యువరాణి డయానా దంపతుల వివాహంనాటి ఓ కేకు ముక్కను వేలం వేయనున్నారు.  మూడువేల మంది అభ్యర్థుల మధ్య 1981లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే వివాహానికి వచ్చిన అతిథుల్లో ఒకరైన నిగెల్ రికెట్స్ నిరుడు మరణించారు. అయితే, అతడికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం కొద్ది రోజుల క్రితం బయటపడింది. ఆ వివాహానికి సంబంధించిన కేకు ముక్కను నిగెల్ నలభై ఒక్క యేళ్లుగా భద్రంగా దాచారు. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ కేకు ముక్కను ప్రముఖ సంస్థ డోర్ అండీ రీస్ వేలం వేయనుందని న్యూయార్క్ పోస్ట్ తెలిపింది.

ఈ వేలాన్ని 300 పౌండ్లు అంటే దాదాపు రూ. 27 వేల నుంచి మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ అంచనాలను మించి అధిక ధరకు అమ్ముడు పోయే అవకాశాలు ఉన్నాయని వార్తా సంస్థ పేర్కొంది. 41 ఏళ్ల క్రితం ఎలాగేతే ప్యాక్ చేసి విక్రయించారో.. ఈ ముక్కను కూడా అదేవిధంగా ప్యాక్చేసి వేలం వేసేందుకు అంతా సిద్ధమయ్యారు. నాడు వివాహంలో చార్లెస్ దంపతులు మొత్తంగా 23 కేకులు కోశారని ఈ ముక్క ఫ్రూట్ కేక్ లోని ఓ భాగంగా గుర్తించారు. వారి వివాహానికి సంబంధించిన ఓ కేకు ముక్కను 2014లో ఇదే సంస్థ వేలం వేయగా నాడు 1,375 పౌండ్లు  అంటే దాదాపు రూ.1.27 లక్షలు పలికింది. 

Follow Us:
Download App:
  • android
  • ios