ఇండియన్ స్టూడెంట్ మిస్సింగ్ కేసులో వీడిన మిస్టరీ..

A man in the US has been convicted of the first-degree murder of an Indian-origin student
Highlights

అమెరికాలో విద్యాభ్యాసం కోసం వచ్చిన స్టూడెంట్ ప్రవీణ్ వర్గీస్ మిస్సింగ్, మర్డర్ కేసు మిస్టరీ వీడిపోయింది.

అమెరికాలో విద్యాభ్యాసం కోసం వచ్చిన స్టూడెంట్ ప్రవీణ్ వర్గీస్ మిస్సింగ్, మర్డర్ కేసు మిస్టరీ వీడిపోయింది. ఈ కేసులో సదరన్ ఇలియన్స్‌కు చెందిన గెగ్ బెతున్‌ను ప్రథమ దోషిగా తేలుస్తూ అక్కడి కోర్టు తీర్పునిచ్చింది.

సదరన్ ఇలియన్స్  యూనివర్సిటీలో ఉన్నత విద్య కోసం వచ్చిన ప్రవీణ్ వర్గీస్ 2014లో ఐదు రోజుల పాటు కనిపించలేదు. ఆ తర్వాత ఈ కేసును మిస్సింగ్ కేసుగా రిజిస్టర్ చేశారు. 

అయితే, ప్రవీణ్ తల్లిదండ్రులు మాత్రం తమ కుమారుడిని ఎవరో హత్య చేసి ఉంటారని పోలీసులను ఆశ్రయించగా, ఈ కేసు విచారణ కోసం 12 మంది సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు.

ఫిబ్రవరి 12, 2014వ తేదీ రాత్రి ప్రవీణ్ ఓ పార్టీ నుంచి ఇంటికి వెళ్తుండగా, మార్గం మధ్యలో తనకి రైడ్ ఇచ్చాడని, తను ఓ షాపులో కొకైన్ కొనడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ప్రవీణ్‌కి తనకి మద్య జరిగిన గొడవలో ప్రవీణ్ తలపై, ముఖంపై పిడిగుద్దులు గుద్దానని, దానితో అతను పక్కనే ఉన్న అడవిలోకి పారిపోయాడని బెతున్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. 

ఈ ఫస్ట్ డిగ్రీ మర్డర్ కేసులో బెతున్‌కి సుమారు 20 నుంచి 60 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ కేసుపై తీర్పు విన్న ప్రవీణ్ తల్లి లవ్లీ వర్గీస్ మీడియాతో మాట్లాడుతూ.. 'చివరకు ప్రవీణ్ రోజు వచ్చింది. ఇప్పడు అతని ఆత్మకు శాంతి కలుగుతుంద'ని అన్నారు.

loader