అమెరికాలోని కొలరాడోలో ఓ మహిళ బాలుడికి వలపువల విసిరి గర్భం దాల్చింది. దీంతో ఆమెను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు.
కొలరాడో : 31 ఏళ్ల ఓ మహిళ 13 ఏళ్ల బాలుడికి వలపు వల విసిరింది. వింటుంటేనే జుగుత్సాకరంగా ఉన్న ఈ ఘటన అమెరికాలోని కొలరాడోలు వెలుగు చూసింది. ఇంట్లో పని ఉందని సాయం చేయాలంటూ బాలుడిని ఇంట్లోకి పిలిచింది. అతనిపై కన్నేసిన ఆ మహిళ పదే పదే పనుల సాకుతో ఇంటికి పిలిచి బాలుడితో శారీరక సంబంధం ఏర్పరచుకుంది. తల్లి వయసు మహిళ కావడంతో ఎవరికి అనుమానం రాలేదు. ఆ మహిళ కూడా ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దు అంటూ బాలుడిని హెచ్చరించింది. ఇద్దరి మధ్య వయసు తేడా దాదాపు రెట్టింపు ఉండడంతో.. ఇలాంటి ఘటన ఒకటి జరుగుతుందని ఊహల్లో కూడా అనుకోని ఉండకపోవడంతో ఎవరు దీనిమీద పెద్దగా పట్టించుకోలేదు.
అయితే ఆ బాలుడితో ఆమె గర్బం దాల్చింది. దీంతో విషయం బట్టబయలైంది. సదరు మహిళ ఆండ్రియో సెరానో (31)ను పోలీసులు అరెస్టు చేశారు. అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలో ఈ ఘటన వెలుగు చూసింది. మైనర్ బాలుడిపై లైంగిక దాడి ఆరోపణలు ఆమె మీద మోపారు. ఆమెను కోర్టుకు తరలించగా అక్కడ ఆ బాలుడితో తనకు లైంగిక సంబంధమున్నమాట నిజమేనని ఆండ్రియో అంగీకరించింది. అంతేకాదు తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఆ బాలుడే అని చెప్పింది,
భారత పర్యటనలో ఆస్ట్రేలియా ప్రధాని..సబర్మతి ఆశ్రమ సందర్శనం..
ఈ విచిత్రమైన కేసులో ఏం చేయాలో ఎలాంటి తీర్పు ఇవ్వాలో తోచక జడ్జీలు తలలు పట్టుకున్నారు. చివరికి మహిళా ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని.. ఆమెను విడుదల చేయాలని.. ఆ మేరకు మొగ్గు చూపారు. దాదాపు రూ.57లక్షలు అంటే 70 వేల డాలర్ల పూచీకత్తును ఇవ్వాలని.. దీంతో విడుదల చేయాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు ఈ కేసులో ఇరుపక్షల మధ్య రాజీ కుదిరింది. ఈ నేపథ్యంలో కేసును పూచికతతో ముగించేందుకే కోర్టు ప్రయత్నించింది. ఇక చివరగా.. ఆ మహిళకు పుట్టబోయే బిడ్డకు తండ్రిగా ఆ బాలుడిని పరిగణించాలని ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
