మహిళ కోసం వెతుకుతున్న సమయంలో వారికి పెద్ద కొండ చిలువ కదలలేని స్థితిలో పడుకొని కనిపించింది. దాని పొట్ట కూడా చాలా ఎక్కువగా ఉండటంతో వారికి అనుమానం కలిగింది.

కొండ చిలువ.. కప్పలు, బల్లులు లాంటి చిన్న చిన్న జంతువులను మింగేస్తుందని తెలుసు. కానీ ఓ బతికున్న మనిషిని కూడా ఓ కొండ చిలువ మింగడం ఎప్పుడైనా చూశారా..? ఇండోనేషియాలో అదే జరిగింది. ఓ బతికున్న మహిళను కొండ చిలువ మింగేసింది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే....

ఇండోనేషియాలోని జంబి ప్రావిన్స్‌లో ఓ 52 ఏళ్ల మహిళను కొండచిలువ మింగేసింది. మహిళ చాలా సేపటి నుంచి కనిపించకపోవడంతో.. స్థానికులు ఆమె కోసం వెతకడం మొదలుపెట్టారు. మహిళ కోసం వెతుకుతున్న సమయంలో వారికి పెద్ద కొండ చిలువ కదలలేని స్థితిలో పడుకొని కనిపించింది. దాని పొట్ట కూడా చాలా ఎక్కువగా ఉండటంతో వారికి అనుమానం కలిగింది. దీంతో... దానిని చంపి.. పొట్ట కోసి చూడగా... దాని పొట్టలో మహిళ చనిపోయి కనిపించడం గమనార్హం. ఆమె ధరించిన దుస్తులతో సహా ఆమెను పాము మింగేయడం గమనార్హం. 

రబ్బర్ ట్యాపింగ్ చేసే జహ్రా(52) పనికి వెళ్తుండగా తప్పిపోయింది. ఆదివారం సాయంత్రం ఆమె పని నుండి తిరిగి రాకపోవడంతో జహ్రా కుటుంబం తప్పిపోయిన ఫిర్యాదుతో పోలీసులు, గ్రామస్థులు వెతకడం ప్రారంభించారు.సదరు మహిళ తప్పిపోయిన తర్వాత రోజు ఒకరు పెద్ద కడుపుతో ఉన్న కొండచిలువను కనుగొన్నారు.

16 అడుగుల పొడవున్న పాము మనిషిని మింగివేసి ఉంటుందని స్థానికులు అనుమానించారు. దీంతో దానిని చంపి.. కొండ చిలువను కోసి చూడగా... సదరు మహిళ మృతదేహం కనిపించింది.పాము కడుపులో మహిళ కనిపించిందని, వారు దానిని గుర్తించినప్పుడు శరీరం చాలా వరకు చెక్కుచెదరకుండా ఉందని పోలీసులు తెలిపారు.