మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనికి కారణమైన మొసలిని ఎలిగేటర్ ట్రాపర్ సహాయంతో పట్టుకున్నారు.
అమెరికా : అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన 85 ఏళ్ల వృద్ధురాలు తన కుక్కతో కలిసి వెళ్తున్న సమయంలో ఓ మొసలి దాడి చేయడంతో చనిపోయిందని ఎన్‌బిసి నివేదించింది. దాడి జరిగినప్పుడు మహిళ తన కుక్కను రిటైర్‌మెంట్ కమ్యూనిటీ దగ్గరున్న చెరువు దగ్గరకు తీసుకు వెళ్తోంది.
సీఎన్ఎన్ మీడియా కథనం ప్రకారం, ఫ్లోరిడా ఫిష్ అండ్ వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ కమీషన్ (ఎఫ్ డబ్ల్యూసీ), సెయింట్ లూసీ కౌంటీ షెరీఫ్ ఆఫీస్ అధికారులు ఫ్లోరిడాలోని సెయింట్ లూసీలో మొసలి దాడి గురించి 911కు వచ్చిన కాల్ కు ప్రతిస్పందించారు.
ఎఫ్ డబ్ల్యూసీ ప్రతినిధి మాట్లాడుతూ, సంఘటన జరిగినప్పుడు మహిళ తన కుక్కతో ఉందని, అయితే ఈ ఘటనలో కుక్క ప్రాణాలతో బయటపడిందని, కానీ అది ఎక్కడుందో, ప్రస్తుతం దాని పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంో తెలియదు.
వలసదారులతో వెళ్తున్న బస్సు బోల్తా.. 17 మంది మృతి, పలువురికి గాయాలు.. మెక్సికోలో ఘటన
మీడియా నివేదికల ప్రకారం, మహిళ కుక్కతో పాటు వాకింగ్ చేస్తున్నప్పుడు, చెరువులో నుంచి ఒక మొసలి బయటకు వచ్చి కుక్కను పట్టుకుంది. దీంతో, కుక్కను కాపాడేందుకు మహిళ ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో ఆ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. సెయింట్ లూసీ కౌంటీ షెరీఫ్ కెన్ మస్కరా మాట్లాడుతూ మొసలి దాదాపు 11 అడుగుల పొడవు ఉంటుందని అంచనా వేశారు.
ఘటనకు సంబంధించిన సమాచారం అందగానే అక్కడికి చేరుకున్న పోలీసులు మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడికి పాల్పడిన మొసలిని ఎలిగేటర్ ట్రాపర్ తో పట్టుకున్నారు. ‘బాధిత కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి" అని ఎఫ్ డబ్ల్యూసీ ప్రకటనలో పేర్కొంది.
"ఎఫ్ డబ్ల్యూసీ ప్రజా భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది. వ్యక్తులు, పెంపుడు జంతువులు లేదా ఆస్తికి ముప్పు కలిగిస్తున్న మొసళ్లకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడానికి స్టేట్‌వైడ్ న్యూసెన్స్ ఎలిగేటర్ ప్రోగ్రామ్ (ఎస్ఎన్ఏపీ)ని నిర్వహిస్తుంది" అని ప్రకటన పేర్కొంది.
