Asianet News TeluguAsianet News Telugu

తల్లిదండ్రుల కళ్లెదుటే ఎనిమిదేళ్ళ చిన్నారిపై మొసలి దాడి.. తల నోట కరుచుకుని, నీటిలోకి లాక్కెళ్లి..

తల్లిదండ్రులు, బంధువులతో సరదాగా చేపలు పడుతున్న ఓ ఎనిమిదేళ్ల చిన్నారిపై మొసలి దాడిచేసి చంపేసింది. ఘటన జరిగిన నెల రోజులకు ఆ చిన్నారి అవశేషాలు మొసలి పొట్టలో బయటపడ్డాయి. 

8-Year-Old Boy Kills by Crocodile In Front Of His Parents In Costa Rica
Author
First Published Nov 30, 2022, 11:20 AM IST

కోస్టారికా : కోస్టారికా లో జూలియో ఒటెరో ఫెర్నాండెజ్ అనే ఓ స్కూలు విద్యార్థిని మొసలి తల్లిదండ్రుల కళ్లెదుటే నీళ్లలోకి లాక్కెళ్లింది. ది న్యూయార్క్ కథనం పోస్ట్ ప్రకారం, జూలియో ఒటెరో ఫెర్నాండెజ్ అనే కోస్టా రికన్ పాఠశాల విద్యార్థి మటినా నదికి వెళ్లినప్పుడు ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. 

అక్టోబరు 30న లిమోన్ లోని మాటినా నది దగ్గర ఇది జరిగింది. కాగా, దాదాపు దాదాపు నెల రోజుల తర్వాత శనివారం నాడు, గుర్తు తెలియని ఓ వేటగాడు అదే ప్రాంతంలో ఒక మొసలిని కాల్చి చంపాడు. ఆ తరువాత స్థానికులు మొసలి పొట్టను కోసి చూడగా అందులో తల వెంట్రులకు, ఎముకలు కనిపించాయి. అవి నెలక్రితం నీళ్లలోకి ఈడ్చుకుపోయిన చిన్నారివేనని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

2021లో యాక్సిడెంట్ అయి.. 1993లో కళ్లు తెరిచిన 58యేళ్ల వ్యక్తి.. ఇంతకీ ఏం జరిగిందంటే...

అసలేం జరిగిందంటే.. ఎనిమిదేళ్ల చిన్నారి తన తల్లిదండ్రులు, నలుగురు తోబుట్టువులు, ఇతర బంధువులతో అక్టోబరు 30న ఫిషింగ్ ట్రిప్‌ కు వెళ్లాడు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో, జూలియో నదిలో మోకాళ్ల లోతు నీటిలో నిలబడి ఉండగా,  ఓ పెద్ద మొసలి అతనిపైకి దూకింది. అతడిని కిందకు లాగి, తలను నోట కరుచుకుని నీళ్లలోకి లాక్కెళ్లింది. 

ఇదంతా ఒడ్డునుండి చూస్తున్న జూలియో తల్లిదండ్రులు, డాన్ జూలియో ఒటెరో, మార్జినీ ఫెర్నాండెజ్ ఫ్లోర్స్ ఏమీ చేయలేక, నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది. దీనిమీద తండ్రి ఒటిరో మాట్లాడుతూ.. "మా అబ్బాయిని మొసలి లాక్కెళుతున్నప్పుడు నీటిలో తేలుతూ వెడుతున్న అతడిని నా భార్య చూసింది. అది మరిచిపోవడం. దాన్నుంచి తేరుకోవడం ఆమెకు చాలా కష్టమైన విషయం’ అని చెప్పుకొచ్చాడు. 

లిమోన్ రెడ్‌క్రాస్ ప్రాంతీయ డైరెక్టర్ టటియానా డియాజ్ దీని గురించి మాట్లాడుతూ.. ‘ఒక అంచనా ప్రకారం.. దాడి తరువాత మొసలి ఆ చిన్నారిని బొరియలోకో, గుహలోకో తీసుకువెళ్లింది. అక్కడ చాలా బొరియలు, గుహలు ఉన్నాయి. అయితే అందులో దేన్లోకి తీసుకువెళ్లిందో మాకు తెలియదు. ఘటన గురించి తెలియగానే మేము కొన్నింటిని అనుమానించి అందులో వెతకడానికి ప్రయత్నించాం. కానీ ఫలితం లభించలేదు’ అన్నారు. ’ఆ ప్రాంతంలో అనేక మొసళ్లు, బొరియలు ఉన్నాయని మాకు తెలుసు కానీ.. వాటిని ఎలా పరిష్కరించాలో మాకు తెలియడం లేదు’ అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios