Asianet News TeluguAsianet News Telugu

యుఎస్-కెనడా సరిహద్దును అక్రమంగా దాటుతూ.. భారతీయులతో సహా 8 మంది వలసదారులు మృతి...

కెనడానుంచి అమెరికాకు అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించి ఎనిమిది మంది మృతి చెందారు. వీరిలో భారతీయ సంతతి వారు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. 

8 migrants, including Indians, died while crossing the US-Canada border illegally - bsb
Author
First Published Apr 1, 2023, 8:53 AM IST

కెనడా : అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఎనిమిది మంది వ్యక్తులు కెనడా-అమెరికా సరిహద్దు సమీపంలోని మార్ష్‌లో చనిపోయారని పోలీసులు శుక్రవారం తెలిపారు. వీరిలో  ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తెలిపారు. అక్వేసాస్నే మోహాక్ కమ్యూనిటీ నుండి తప్పిపోయిన వ్యక్తికి చెందిన బోల్తా పడిన పడవ సమీపంలో వారి మృతదేహాలు కనుగొనబడ్డాయని అధికారులు తెలిపారు.

"మొత్తం ఎనిమిది మృతదేహాలను నీళ్లలో నుండి స్వాధీనం చేసుకున్నారు" అని స్థానిక పోలీసు చీఫ్ షాన్ డులుడే విలేకరుల సమావేశంలో చెప్పారు. రెండు కుటుంబాలకు చెందిన ఎనిమిదిమంది వ్యక్తులు వీరంతా.. వీరిలో ఒకరు కెనడియన్ పాస్‌పోర్ట్‌లను కలిగి ఉన్న రొమేనియన్ సంతతికి చెందినవారు, మరొకరు భారతదేశం నుండి వచ్చినవారిగా.. గురువారం ఆలస్యంగా కనిపెట్టారు. వీరిలో మూడు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు కూడా ఉన్నారు.

శుక్రవారం విలేకరుల సమావేశంలో దీని గురించి చెబుతూ పోలీసులు..  "రొమేనియన్ సంతతికి చెందిన కెనడియన్ పౌరుడు ఒకరు కాగా, మరో మహిళ భారతీయ జాతీయురాలిగా గుర్తించాం" అని తెలిపారు. కెనడా నుండి చట్టవిరుద్ధంగా యునైటెడ్ స్టేట్స్‌లోకి ప్రవేశించడానికి వీరందరూ ప్రయత్నిస్తున్నారని కెనడియన్ అధికారులు భావిస్తున్నారు.

కరాచీలో తొక్కిసలాట.. 12 మంది మృతి.. మృతులందరూ మహిళలే.. అసలేం జరిగింది?

మోహాక్ గిరిజన భూభాగం కెనడియన్ ప్రావిన్సులు క్యూబెక్, అంటారియో, యూఎస్ రాష్ట్రం న్యూయార్క్‌లో విస్తరించి ఉంది. వర్షం, చిరుజల్లులు.. బలమైన గాలి వంటి పేలవమైన వాతావరణ పరిస్థితుల కారణంగా పడవ బోల్తా పడి ఈ ప్రమాదం సంభవించింది. ఈ పడవ "చాలా చిన్నది" అని తెలిపారు. నీటిలో ప్రయాణించడానికి ఇది సరైన సమయం కాదు.. స్థానిక డిప్యూటీ పోలీసు చీఫ్ లీ-ఆన్  చెప్పారు.

ఆ సమయంలో నీళ్లలో ప్రయాణించడానికి.. వారిని అక్రమంగా దాటించడానికి కొన్నిసార్లు స్థానిక ప్రజలు.. ప్రత్యేకించి యువకులు డబ్బులకోసం ఆశపడి చేస్తారన్నారు. ఘటన విషయం తెలియగానే ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ మొదలయ్యింది. వైమానిక శోధనలో మొదటి మృతదేహం కనుగొనబడింది.

మరణానికి కారణాన్ని తెలుసుకోవడానికి అధికారులు శవపరీక్ష, టాక్సికాలజీ పరీక్ష ఫలితాల కోసం చూస్తున్నారు. ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ఈ ఘటన మీద విలేకరులతో మాట్లాడుతూ, "చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు మా హృదయాపూర్వక సంతాపం.. ఇది హృదయ విదారక పరిస్థితి" అన్నారు. అక్వేసాస్నే నుంచి యూఎస్ లోకి ప్రవేశించే వ్యక్తుల సంఖ్య ఇటీవల బాగా పెరిగింది. ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఇప్పటివరకు ఇలాంటి 48 అక్రమ చొరబాట్లను గుర్తించారు.

యుఎస్ వైపు దిగిన తర్వాత, వాటిని సాధారణంగా ఒడ్డుకు తీసుకువెడతారు. అక్కడ వేరే వాహనాల ద్వారా న్యూయార్క్ రాష్ట్రానికి వారిని తరలిస్తారని తెలిపారు. కాగా, కెనడా నుండి యునైటెడ్ స్టేట్స్‌లోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నిస్తుండగా ఇటీవలి నెలల్లో సరిహద్దు సమీపంలో మరో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు.

గత వారం అధ్యక్షుడు జో బిడెన్ ఒట్టావా పర్యటన సందర్భంగా దీనికి సంబంధించి ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇరు దేశాలు  తమ దేశాల సువిశాల సరిహద్దులో పెరుగుతున్న అక్రమ వలసలను, ఎలాంటి పత్రాలు లేని వలసల సమస్యను ఎదుర్కోవడంపై ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.

ఈ ఏర్పాటు ద్వారా యునైటెడ్ స్టేట్స్ నుండి కెనడాలోకి ప్రవేశించే డాక్యుమెంట్ లేని శరణార్థులను వెనుతిరిగేలా చూస్తారు, కెనడా ఏకకాలంలో చట్టపరమైన ప్రవేశం కోసం మార్గాన్ని విస్తరిస్తుంది. ఈ ప్రణాళిక యూఎస్-మెక్సికన్ సరిహద్దుపై అణిచివేత వంటిదని.. వలసదారుల హక్కుల కార్యకర్తలు విమర్శలు గుప్పించారు.  ఏది ఏమైనప్పటికీ, బిడెన్, ట్రూడో ఇద్దరూ రాజకీయంగా ఒత్తిడికి దారి తీస్తున్న ఈ ఇమ్మిగ్రేషన్ వ్యవస్థల నుండి ఉపశమనం పొందారు.

Follow Us:
Download App:
  • android
  • ios