Asianet News TeluguAsianet News Telugu

మెక్సికో మరోసారి కాల్పుల మోత.. నైట్‌క్లబ్‌లో దుండగుల హల్ చల్.. 8 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు

అమెరికాలోని మెక్సికోలో కాల్పుల కలకలం చేలారేగింది. బిజీ నైట్‌క్లబ్‌లో దుండగులు కాల్పులను తెగబడ్డారు. 8 మంది మృతి, 5 మందికి గాయాలైనట్టు సమాచారం. 
 

8 Killed, 5 Injured In Shooting At Busy Nightclub In Mexico
Author
First Published Jan 30, 2023, 3:39 AM IST

అమెరికాలోని మెక్సికో నగరం దుండగుల కాల్పులతో మరో సారి దద్దరిల్లింది. తాజాగా ఉత్తర మెక్సికోలోని జెరెజ్ పట్టణంలో రద్దీగా ఉండే నైట్‌క్లబ్‌లో ఓ దుండగులు తెగబడ్డారు. వారు విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది మరణించగా, ఐదుగురు గాయపడ్డారని పోలీసులు ఆదివారం తెలిపారు. జకాటెకాస్ రాష్ట్రంలో ఈ సంఘటన శనివారం  అర్థరాత్రి నుండి జరిగింది. భారీగా ఆయుధాలు ఉన్న వ్యక్తులు, రెండు వాహనాలలో బార్‌కు వచ్చారు. అనంతరం బార్ లోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ మేరకు భద్రతా సెక్రటేరియట్ నివేదిక తెలిపింది. 

ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా..మరో ఇద్దరు వైద్య చికిత్స పొందుతూ మరణించారు. అదే సమయంలో కాల్పుల్లో గాయపడిన ఐదుగురు వ్యక్తులు  ఆసుపత్రిలో చిక్సిత పొందుతున్నారు. బాధితుల్లో క్లబ్ ఉద్యోగులు, సంగీతకారులు, కస్టమర్లు ఉన్నారని స్థానిక మీడియా తెలిపింది. క్లబ్ ఫ్లోర్ రక్తంతో కొట్టుకుపోవడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.  

"ఎల్ వెనాడిటో" అని పిలువబడే బార్, రాష్ట్ర రాజధాని నగరం జకాటెకాస్‌కు నైరుతి దిశలో 60 కిలోమీటర్లు (36 మైళ్ళు) దూరంలో ఉన్న మునిసిపాలిటీ అయిన జెరెజ్ మధ్యలో ఉంది. గతేడాది జెరెజ్ లో భారీ హింసాకాండ చోటు చేసుకుంది.  దీంతో సమీపంలోని గ్రామీణ కమ్యూనిటీలలోని వందలాది మంది నివాసితులు తమ ఇళ్లను విడిచిపెట్టవలసి వచ్చింది. 

Follow Us:
Download App:
  • android
  • ios