Asianet News TeluguAsianet News Telugu

అమెరికాలో కాల్పుల ఘటన నిందితుడైన 72 యేళ్ల వృద్ధుడి ఆత్మహత్య...

అమెరికాలో కాల్పుల ఘటన నిందితుడైన 72 యేళ్ల వృద్ధుడి తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతనిపేరు హూ కాన్ ట్రాన్ గా గుర్తించారు. 

 

72-year-old man who was accused in a shooting incident in America committed suicide - bsb
Author
First Published Jan 23, 2023, 12:05 PM IST

అమెరికా : అమెరికాలో కలకలం సృష్టించిన కాల్పుల ఘటనలో  మారణ హోమానికి పాల్పడిన అనుమానితుడైన వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికాలోని మాంటేరి పార్క్ లో బాల్ రూమ్ డాన్స్ స్టూడియోలో శనివారం కాల్పుల ఘటన భయాందోళన కలిగించింది. ఈ ఘటన అనంతరం ఆవృద్ధుడు షాట్ గన్ తో తనను తానే కాల్చుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు అతని శరీరంపై గాయాలు కనుగొన్నట్లు పోలీసులు తెలిపారు. అనుమానితుడైన ఆ వృద్ధుడు చైనా నుంచి వలస వచ్చిన హూ కాన్ ట్రాన్ (72)గా గుర్తించారు.

ట్రాన్ మారణహోమానికి పాల్పడిన తర్వాత అతడి ఆయుధాన్ని కొందరు వ్యక్తులు లాక్కున్నారని సమాచారం. ట్రాన్ అంతకుముందు ట్రక్ డ్రైవర్ గా పని చేసినట్లు సమాచారం. ట్రాన్స్ ట్రక్కింగ్ ఐఎన్ సీ అనే పేరుతో అతను వ్యాపారం చేశాడు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఆదివారం కాల్పులు జరిపిన డాన్స్ స్టూడియోకు అతను తరచూ వచ్చేవాడని చెబుతున్నారు. అతని మాజీ భార్యతో కలిపి అక్కడే సమయం గడిపేవాడని వారు అన్నారు.

ఘటన స్థలానికి సమీపంలోని సాంగ్ గాబ్రీయల్లోని ట్రాన్స్ నివసించేవాడు. 2006లో భార్యకు ట్రాన్స్  విడాకులు ఇచ్చాడు. ఇక్కడికి అతను తరచుగా వచ్చేవాడు కానీ అక్కడ ఉండే చాలామంది ట్రైనర్స్,  వ్యక్తులతో అతడికి సరిగా పడేది కాదని స్థానికులు పోలీసులకు చెప్పారు. ట్రాన్స్కు తొందరగా కోపం వచ్చేదని అన్నారు.  ఘటన జరిగిన రోజు కూడా ట్రాన్స్ తన మాజీ భార్యను వెతుక్కుంటూ డాన్స్ స్టూడియోకు వచ్చారని స్థానిక పత్రికల్లో కథనాలు వచ్చాయి. 

ఆ తర్వాత అక్కడ ఆమె కనిపించగానే విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు అని తెలిపారు. శనివారం రాత్రి పదిన్నర గంటల సమయంలో లాస్ ఏంజిల్స్ ప్రాంతంలోని బాల్ రూమ్ డాన్స్ క్లబ్ వద్ద ఈ కాల్పుల ఘటన జరిగింది. చైనా కొత్త సంవత్సరమైన లూనార్ సంవత్సర వేడుకల్లో నేపథ్యంలో ఆ సమయంలో అక్కడ వేలాదిమంది గుమిగుడి ఉన్నారు.  ఆ సమయంలో ఓ సాయుధుడు  మిషన్ గన్ తో వారి మీద పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.  కాల్పులు నగరంలో 60 వేల మంది జనాభా ఉన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios