Asianet News TeluguAsianet News Telugu

న్యాయవ్యవస్థలో యూఏఈ భారీ సంస్కరణలు: ఆ ఏడు మార్పులు ఇవే..!!

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం న్యాయ వ్యవస్థలో కీలక సంస్కరణలను అమల్లోకి తీసుకురానుంది. యుఎఇకి చెందిన ది నేషనల్ వార్తాపత్రిక ప్రకారం, ఈ కొత్త చట్టాలు - వెంటనే అమలులోకి వస్తాయి.

7 key changes UAE has made to its legal system ksp
Author
Dubai - United Arab Emirates, First Published Nov 7, 2020, 6:41 PM IST

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం న్యాయ వ్యవస్థలో కీలక సంస్కరణలను అమల్లోకి తీసుకురానుంది. యుఎఇకి చెందిన ది నేషనల్ వార్తాపత్రిక ప్రకారం, ఈ కొత్త చట్టాలు - వెంటనే అమలులోకి వస్తాయి.

జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి మరియు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు మరియు యుఎఇలో నివసిస్తున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు తమ దేశం గమ్యస్థానంగా కొనసాగడానికి ఈ సంస్కరణలు దోహదం చేస్తాయని ప్రభుత్వం చెబుతోంది. 

ఆ సంస్కరణలు ఇవే:

  • మద్యపానం చేసేవారు, మద్యాన్ని విక్రయించేవారు ఇకపై ఎలాంటి లైసెన్స్ లేకుండా అధీకృత ప్రాంతాల్లో అమ్మకాలు కొనసాగించుకోవచ్చు. దీనిపై ఎటువంటి జరిమానాలు విధించరు. కాగా, యూఏఈ చట్టాల ప్రకారం.. మద్యం సేవించడానికి ఓ వ్యక్తికి కనీసం 21 సంత్సరాలు వయసు నిండి వుండాలి. అంతకంటే తక్కువ వయసున్న వ్యక్తికి మద్యం విక్రయిస్తే శిక్ష తప్పదు.
  • అలాగే పెళ్లి కాకుండానే యువతి, యువకులు చట్టబద్ధంగా కలిసి జీవించవచ్చు. ఇప్పటి వరకు పెళ్లికానీ జంటలు కలిసి ఒకే గదిని పంచుకోవడం యూఏఈలో చట్ట విరుద్ధం.
  • ఒక జంట తమ స్వదేశంలో వివాహం చేసుకుని యూఏఈలో విడాకులు తీసుకుంటే.. యూఏఈ కోర్టులో ఈ ప్రక్రియ సమానంగా ఉంటుంది. అలాగే వివాహం జరిగిన దేశ చట్టాలు సైతం వర్తించబడతాయి.
  • మహిళలను ఎలాంటి వేధింపులకు గురిచేసే పురుషులకైనా కొత్త చట్టాలు కఠినమైన శిక్షను విధిస్తాయి. వీటిలో వేధింపులతో పాటు భౌతిక దాడి కూడా వుండొచ్చు. 
  • మైనర్ లేదా మానసిక అంగవైకల్యంతో బాధపడుతున్న వారిపై అత్యాచారానికి పాల్పడితే శిక్ష కఠినంగా వుంటుంది,
  • ‘‘ గౌరవం’’ పేరిట జరిగే  దారుణాల్లో.. ఒక మహిళా బంధువుపై దాడి చేసినందుకు పురుషుడిని గతంలో తేలికైన శిక్షతో వదిలి వేసేవారు. కానీ ఇకపై అలా వుండదు.
  • ఇకపై ఆత్మహత్య, ఆత్మహత్యాయత్నం కేసులు విచారించబడతాయి. ఇప్పటి వరకు ప్రాణాలను తీసుకున్న, ప్రాణాలతో బయటపడిన వారిపై విచారణ జరిపించవచ్చు. అంతేకాకుండా ఆత్మహత్యాయత్నంలో ఒక వ్యక్తికి సహాయం చేసిన ఎవరికైనా జైలు శిక్ష తప్పదు. 
Follow Us:
Download App:
  • android
  • ios