Asianet News TeluguAsianet News Telugu

అమెరికాలో కాల్పుల కలకలం.. బర్త్ డే సెలబ్రేషన్స్ లో ఏడుగురి మృతి

ఇప్పటికే చాలాసార్లు ఈ కాల్పుల ఘటన కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోగా.. తాజాగా మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. పుట్టిన రోజు వేడుకల్లో ఓ అంగతకుడు తుపాకీతో ప్రవేశించి బీభత్సం సృష్టించాడు.
 

7 Dead At US Birthday Party Shooting: Police
Author
Hyderabad, First Published May 10, 2021, 8:24 AM IST

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఇప్పటికే చాలాసార్లు ఈ కాల్పుల ఘటన కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోగా.. తాజాగా మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. పుట్టిన రోజు వేడుకల్లో ఓ అంగతకుడు తుపాకీతో ప్రవేశించి బీభత్సం సృష్టించాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆదివారం అర్ధరాత్రి కొలరాడో మొబైల్‌ హోమ్‌ పార్క్‌లో జరిగిన పుట్టిన రోజు వేడుకల్లో ఓ దుండగుడు కాల్పులు జరుపడంతో ఏడుగురు మృతి చెందారు. ఆ తర్వాత దుండగుడు తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుల్లో ఒకరిది పుట్టిన రోజు వేడుక అని తెలిపారు. అయితే కాల్పులకు గల కారణాలేమిటో తెలియలేదని పోలీసులు పేర్కొన్నారు. మృతుల్లో పిల్లలు ఉన్నట్లు సమాచారం.  ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉండగా... మరో ప్రాంతంలో కూడా కాల్పులు జరిగినట్లు సమాచారం ఉంది. అక్కడ నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఉడ్‌ల్యాండ్‌లో పొరుగువారిపై పొరుగింటి వారిపై ఓ వ్యక్తి కాల్పులు జరుపడంతో ముగ్గురు మృతి చెందారు. నిందితుడిపై పోలీసులు ఎదురుకాల్పులు చేయగా.. దుండగుడు ప్రాణాలు కోల్పోయాడు. మొత్తంగా.. రెండు ఘటనలు కలిసి 12 మంది ప్రాణాలు కోల్పోయారు. 

Follow Us:
Download App:
  • android
  • ios