Asianet News TeluguAsianet News Telugu

న్యూజిలాండ్‌లోని కెర్మాడెక్ దీవులలో 7.1 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ..

న్యూజిలాండ్‌లోని కెర్మాడెక్ దీవులలో గురువారం ఉదయం భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 7.1గా నమోదు అయ్యింది. అయితే ఈ భూకంపం వల్ల సునామీ వచ్చే అవకాశం ఉందని  యూఎస్ సునామీ హెచ్చరిక వ్యవస్థ తెలిపింది. 

7.1 magnitude earthquake in Kermadec Islands, New Zealand. Tsunami warning issued.
Author
First Published Mar 16, 2023, 9:37 AM IST

న్యూజిలాండ్‌కు ఉత్తరాన కెర్మాడెక్ దీవులలో గురువారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 7.1గా నమోదు అయ్యింది. 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే అంచనా వేసింది. అయితే దీనికి 300 కిలో మీటర్ల వ్యాసార్థంలో సమీపంలోని జనావాసాలు లేని ద్వీపాలకు సునామీ ప్రమాదం పొంచి ఉందని యూఎస్ సునామీ హెచ్చరిక వ్యవస్థ పేర్కొంది.

కాగా.. భూకంపం కారణంగా న్యూజిలాండ్‌కు సునామీ ముప్పు లేదని నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ తెలిపింది. ప్రపంచంలోని రెండు ప్రధాన టెక్టోనిక్ ప్లేట్లు అయిన పసిఫిక్ ప్లేట్, ఆస్ట్రేలియన్ ప్లేట్ సరిహద్దులో ఉన్నందున న్యూజిలాండ్ తరచూ భూకంపాలకు గురవుతుంది. ఇది రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలిచే తీవ్రమైన భూకంప కార్యకలాపాల జోన్ అంచున కూడా ఉంది. ప్రతీ సంవత్సరం, న్యూజిలాండ్‌ను వేలాది భూకంపాలు వణికిస్తున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios