Asianet News TeluguAsianet News Telugu

కాలిఫోర్నియాలో భూకంపం: 25 ఏళ్లలో ఇదే అతి పెద్దది

లాస్‌ఏంజెల్స్‌ ప్రాంతానికి 202 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించినట్టు అధికారులు తెలిపారు. భూకంపం వల్ల కొన్ని ఇళ్లకు నష్టం వాటిల్లినట్లు అధికారులు చెప్పారు.

7.1 Earthquake Hits Southern California; Houses Damaged, Say Firefighters
Author
California, First Published Jul 6, 2019, 10:35 AM IST

కాలిఫోర్నియా: అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో భూకంపం సభవించింది.  రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 7.1గా నమోదైంది. గత 25 ఏళ్ల కాలంలో ఇదే అతి పెద్ద భూకంపం. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. 

లాస్‌ఏంజెల్స్‌ ప్రాంతానికి 202 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించినట్టు అధికారులు తెలిపారు. భూకంపం వల్ల కొన్ని ఇళ్లకు నష్టం వాటిల్లినట్లు అధికారులు చెప్పారు. పునాదులు బీటలు వారాయని, ప్రహరీగోడలు కూలిపోయాయని వారు చెప్పారు. స్వల్పంగా గాయపడిన ఒకరికి ఫైర్ ఫైటర్స్ చికిత్స చేశారు.  

గురువారం కూడా కాలిఫోర్నోయాలో భూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టార్ స్కేల్‌పై 6.4గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే విభాగం వెల్లడించింది. లాస్ ఏంజిల్స్ పట్టణానికి ఈశాన్యంలో 320 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios