ఫేస్‌బుక్ లవ్: ప్రియుడి కోసం అమెరికా నుంచి వచ్చిన బామ్మ!

65 Yr Old Traveled From USA to India To Meet Her Love
Highlights

ప్రేమ గుడ్డిది, ప్రేమ పిచ్చిది, ప్రేమకి వయసుతో పనిలేదు

ప్రేమ గుడ్డిది, ప్రేమ పిచ్చిది, ప్రేమకి వయసుతో పనిలేదు, ప్రేమకు కులం, మతం, ప్రాంతాలతో పనిలేదు. ఇవన్నీ ప్రేమలో ముగినిపోయిన ప్రేమికులు చెప్పే మాటలు. ఈ సంఘటన గురించి తెలుసుకుంటే ఇవన్నీ నిజమే అనిపిస్తాయి. ఫేస్‌‍బుక్ ద్వారా పరిచయమైన ఓ ప్రియుడి కోసం ఏకంగా అమెరికా నుంచి ఇండియాకే వచ్చేసింది ఓ 65 ఏళ్ల బామ్మ. ఇంతకీ ఈమె ప్రేమలో పడిన ప్రియుడి వయసు ఎంతో కేవలం 27 ఏళ్లు మాత్రమే.

అమెరికాకు చెందిన కైరన్ లిలియన్ ఎన్బర్ (65 ఏళ్లు)కు హర్యానాలోని కైథల్ గ్రామానికి చెందిన ప్రవీణ్‌కు ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైంది. ఈ పరిచయం కాస్తా అతికొద్ది కాలంలోనే ప్రేమగా మారింది. ఆ ప్రేమ కాస్తా పెళ్లికి దారితీసింది. ప్రవీణ్ ప్రేమకు ముగ్దురాలైన ఈ బామ్మ ఈనెల 15వ తేదీన అమెరికా నుంచి హర్యానాకు విచ్చేసింది. వీరిద్దరి పెళ్లికి ప్రవీణ్ ఇంట్లో పెద్దలు కూడా అంగీకరించారు.

ఈ నెల 21 ప్రవీణ్, ఎన్బర్‌లకు సిక్కుల ఆచారం ప్రకారం వివాహం జరిగింది. త్వరలోనే ఈ ప్రేమ జంట హనీమూన్‌కి కూడా వెళ్లనుంది. 

loader