26 రోజుల్లో 55 మందికి మరణ శిక్ష అమలు.. ఎలుకల గదిలో బంధించడం, అత్యాచారం వంటి శిక్షలూ.. ఇరాన్‌లో దారుణాలు!
ఇరాన్‌లో అధికారులు నిరసనకారుల్లో భయం నింపడానికి దారుణమైన మరణ శిక్షల అమలు చేపడుతున్నారు. ఈ ఏడాది తొలి 26 రోజుల్లో 55 మందికి మరణ శిక్ష అమలు చేసి చంపేసినట్టు నార్వేకు చెందిన ఇరాన్ హ్యూమన్ రైట్స్ సంస్థ వెల్లడించింది.

న్యూఢిల్లీ: ఇరాన్ అధికారులు ఈ ఏడాదిలో 55 మందికి మరణశిక్ష అమలు చేసినట్టు నార్వేకు చెందిన ఇరాన్ హ్యూమన్ రైట్స్ అనే సంస్థ వెల్లడించింది. దేశంలో నిరసనకారులకు వణుకు పుట్టించడమే లక్ష్యంగా ఈ దేశం మరణ శిక్షలు అమలు చేస్తున్నట్టు కొందరు అభిప్రాయపడుతున్నారు. తక్కువ వయసున్న వారినీ నిరసనల్లో పాల్గొన్న కారణంగా మరణ శిక్ష వేసినట్టు హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొంది. ఇందులో ముగ్గురిపై నిర్బంధంలో దారుణమైన శిక్షలు వేసినట్టు తెలిసింది.
ఇరాన్‌లో ఈ ఏడాది 26 రోజుల్లో 55 మందికి మరణ శిక్ష అమలు జరిగిందని ఇరాన్ హ్యూమన్ రైట్స్ ధ్రువీకరించింది. నలుగురిని నిరసనలు చేశారనే కారణంగా చంపేసినట్టు వివరించింది. కాగా, మెజార్టీగా 37 మంది దోషులు మాత్రం డ్రగ్స్ సంబంధ నేరస్తులు అని తెలిపింది.
ఇరాన్‌లో నిరసనలు చేసిన కారణంగా మరో 107 మంది మృత్యువు ముంగిట్లో ఉన్నారని వివరించింది. ఏ కాలంలో వారికి మరణ శిక్ష అమలు చేస్తారా? అనే విధంగా ఉన్నాయి పరిస్థితులు. కనీసం 107 మంది మరణ శిక్ష విధించింది. కాబట్టి, వారంతా బిక్కుబిక్కుమంటున్నారు.
ఇరాన్‌లో మరణ శిక్షల అమలు పెరుగుతున్న సమయంలో ఐహెచ్ఆర్ వాదన ఇలా ఉన్నది. ఇస్లామిక్ రిపబ్లిక్ అయిన ఇరాన్ అమలు చేస్తున్న ప్రతి మరణ శిక్ష.. రాజకీయ కోణంలో తీసుకున్నదే అని పేర్కొంటున్నది. అ మరణ శిక్షల అమలు వెనుక ఇరాన్ లక్ష్యం ఒకటే అని, సమాజంలో భయం, ఆందోళనలు పెంచాలనుకోవడమే లక్ష్యం అని వివరించింది.
Also Read: ఇరాన్‌లో వెల్లువెత్తుతున్న నిరసనలు.. ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ నటీ అరెస్టు.. ఆమె చేసిన నేరమేంటీ?
ప్రభుత్వం మొత్తంగానే మరణ శిక్షలను నిలిపేయాలంటే రాజకీయ, రాజకీయేతర మరణ శిక్షలను అమలు చేయకుండా అడ్డుకోవడమే ఏకైక మార్గం అని వివరించింది. అంతేకాదు, ఈ మరణ శిక్షలపై అంతర్జాతీయ సమాజం ఎక్కువగా దృష్టి సారించడం లేదని పేర్కొంది. తద్వార నిరసనకారులను ప్రభుత్వం చంపేయడం సులువు అవుతున్నదని తెలిపింది.
మహ్సా అమీని మరణం తర్వాత ప్రభుత్వం మరణ శిక్షలను భయపట్టే ఒక పరికరంగా వాడుకుంటున్నదని యాక్టివిస్టులు వాదిస్తున్నారు. మరణ శిక్ష విధించిన ముగ్గురు వ్యక్తులను డిసెంబర్‌లో దారుణంగా శిక్షించిందని ఆమ్నెస్టీ శుక్రవారం పేర్కొంది. వారిని కొరడాలతో కొట్టడం, కరెంట్ షాక్ ఇవ్వడం, తలక్రిందులుగా వేలాడదీయడం, గన్ పాయంట్ చేసి బెదిరించడం మార్గాల్లో వారిని శిక్షించారని తెలిపింది.
జవద్ రౌహి అనే 31 ఏల్ల వ్యక్తి జననాంగాలపై ఐస్ పెట్టి చిత్రహింసలు చేశారని ఆమ్నెస్టీ తెలిపింది. 19 ఏళ్ల మెహ్దీ మొహమ్మదిపర్డ్‌ను వారం పాటు ఎలుకలతో నింపిన ఒంటరి గదిలో ఉంచారు. రేప్ చేశారని, దానితో ఆనల్, రెక్టాల్ బ్లీడింగ్ అయిందని, ఫలితంగా హాస్పిటల్‌లో చేర్పించాల్సి వచ్చిందని ఆమ్నెస్టీ వివరించింది.
18 ఏళ్ల అర్షియ తక్దస్తాన్‌ను నేరాలను అంగీకరించాలని తుపాకి గురి పెట్టి బెదిరించారు. వీడియో కెమెరా ముందర అతడిని నేరాలను అంగీకరించాలని, లేదంటే చంపేస్తామని బెదిరించారని ఆమ్నెస్టీ రిపోర్ట్ చేసింది.