Asianet News TeluguAsianet News Telugu

నేపాల్ పొఖారాలో కుప్పకూలిన విమానం:45 మృతదేహల వెలికితీత, విచారణ

నేపాల్‌లో కుప్పకూలిన విమానంలో  ఐదుగురు భారతీయులు కూడా  మృతి చెందారు.  ప్రమాదం జరిగిన సమయంలో  72 మంది  ఉన్నారు. వీలో  68 మంది ప్రయాణీకులున్నారు. మిగిలిన నలుగురు  విమాన సిబ్బంది. 

5 Indians among 72 aboard Nepal plane that crashed; 40 bodies recovered
Author
First Published Jan 15, 2023, 3:31 PM IST

ఖాట్మాండ్:నేపాల్ లో  ఆదివారంనాడు  జరిగిన  విమాన ప్రమాదంలో  ఐదుగురు  భారతీయులు మృతి చెందారు. ఏటీఆర్-72  నెంబర్ గల విమానం  ల్యాండింగ్ కు ముందు  కూలిపోయింది.  ఈ ప్రమాదంలో  విమానంలో  ఉన్న  72 మంది  ప్రయాణీకులు  మృతి చెందారని  అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే  45 మృతదేహలను  వెలికితీశారు. విమానం లో  68 మంది  ప్రయాణీకులు , నలుగురు విమాన సిబ్బంది ఉన్నారు.   పొఖారా ఎయిర్ పోర్టులో  ల్యాండ్ అయ్యే సమయంలో  విమానం కుప్పకూలింది. పొఖారా విమానాశ్రయంలో  ల్యాండింగ్ కి 10 సెకన్ల ముందు  విమానం  కూలిపోయింది. ఈ సమయంలో భారీ శబ్దంతో  మంటలు వ్యాపించాయి. సంఘటన స్థలంలో  రెస్క్యూ సిబ్బంది  సహాయక చర్యలు  చేపట్టారు.  

మంటలను రెస్క్యూ సిబ్బంది  మంటలను ఆర్పారు.  ప్రమాదం జరిగిన సమయంలో  విమానంలో  53 మంది నేపాలీలు, ఐదుగురు భారతీయలు, నలుగురురష్యన్లు, ఇద్దరు కొరియన్లు, ఫ్రెంచ్,   అర్జెంటీనా, ఐరిష్ కు చెందిన  ఒక్కొక్క ప్రయాణీకుడున్నారని ఎయిర్ పోర్టు అధికారులు  ప్రకటించారు. పోఖారా విమానాశ్రయంలో  విమానం కూలిపోవడంతో  ప్రభుత్వం అత్యవసరంగా  మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు  చేసింది.  ఏటీఆర్ -72 విమానం  గంటకు  500 కిలోమీటర్ల వేగంతో  ప్రయాణం చేస్తాయి.  ఏటీఆర్ 72 తరహా విమానాలు  అతి తక్కువ ఎత్తులో ప్రయాణించేలా  తయారు చేశారు.  యతి ఎయిర్ లైసెన్స్ ఎక్కువగా  పాత విమానాలను ఉపయోగిస్తాయని   నేపాల్  ఎవియేషన్ అథారిటీకి చెందిన అధికారులు  చెబుతున్నారు. ఇవాళ జరిగిన  ప్రమాదంపై విచారణ జరుపుతున్నట్టుగా అధికారులు  తెలిపారు. పొఖారా పాత విమానాశ్రయం, ఫొఖారా అంతర్జాతీయ విమానాశ్రయం  మధ్య  ఈ విమానం కుప్పకూలిందని ఎయిర్ లైన్స్  తెలిపారిన  స్థానిక మీడియా ప్రకటించింది. ఈ విమానం కూలిపోవడానికి ముందు  తీసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

also read:నేపాల్‌లో కుప్పకూలిన విమానం.. ప్రమాద సమయంలో విమానంలో 72 మంది.. 16 మృతదేహాలు వెలికితీత..

తొలుత  తూర్పు ప్రాంతంలో  విమానం ల్యాండింగ్  కు  ఏటీసీని  పైలెట్ కోరారు. దీనికి ఏటీసీ నుండి అనుమతి ఇచ్చింది.  ఆ తర్వాత  పశ్చిమ దిశలో  ల్యాండ్ చేయడానికి  పైలెట్ ఏటీసీని అనుమతి కోరారు. పశ్చిమ దిశలో  అనుమతికి  ఏటీసీ  అనుమతినిచ్చింది.  ల్యాండింగ్  చేయడానికి  10 సెకస్ల ముందు విమానం కూలిపోయింది. ఇవాళ  ఫోఖారాలో  వాతావరణ పరిస్థితులు  అనుకూలంగా  ఉన్నాయి.  విమానంలోని బ్లాక్ బాక్స్ ను విశ్లేషిస్తే  ప్రమాదానికి కారణాలు తెలిసే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటన నేపథ్యంలో  ప్రధాని  పుష్పకమాల్  దహల్,  హోంమంత్రి రబీలామిచానే త్రిభువన్ విమానాశ్రయానికి చేరుకున్నారు.  రెస్క్యూ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు గాను  ప్రధాని  పోఖారాకు వెళ్లనున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios