ఇజ్రాయెల్ అరబ్ పౌరులపై కాల్పులు.. ఐదుగురు మృతి
Jerusalem: అరబ్ టౌన్ లో పెరుగుతున్న నేరాలను పరిష్కరించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం పై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఉత్తర ఇజ్రాయెల్ లో జరిగిన కాల్పుల్లో ఐదుగురు ఇజ్రాయెల్-అరబ్ పౌరులు మరణించారు. పలువురు గాయపడ్డారు. గత కొంత కాలంగా ఈ ప్రాంతంలో నేరాల రేటు క్రమంగా పెరుగుతోంది.

Israel Shooting: అరబ్ టౌన్ లో పెరుగుతున్న నేరాలను పరిష్కరించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం పై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఉత్తర ఇజ్రాయెల్ లో జరిగిన కాల్పుల్లో ఐదుగురు ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. పలువురు గాయపడ్డారు. గత కొంత కాలంగా ఈ ప్రాంతంలో నేరాల రేటు క్రమంగా పెరుగుతోంది.
వివరాల్లోకెళ్తే.. ఉత్తర ఇజ్రాయెల్ లోని యాఫా అన్-నసెరియాలో జరిగిన కాల్పుల ఘటనలో ఐదుగురు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను నజరేత్ లోని ఇంగ్లిష్ ఆసుపత్రికి తరలించగా, వారిలో ఐదుగురు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఇజ్రాయెల్ పోలీసు కమిషనర్ కోబి షబ్తాయ్, జాతీయ భద్రతా మంత్రి ఇటామర్ బెన్-గ్విర్ (ఓట్జ్మా యెహుదిట్) సంఘటనా స్థలానికి చేరుకున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
నజరేత్ నగరానికి సమీపంలోని అరబ్ పట్టణమైన యాఫాలోని కారు వాష్ బయట కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. వారు ఈ సంఘటనను నేరపూరిత చర్యగా పేర్కొన్నారు కానీ పూర్తి వివరాలను వెల్లడించలేదని స్థానిక మీడియా పేర్కొంది. ఉత్తర ప్రాంతంలోని రెండు స్థానిక నేర కుటుంబాల మధ్య కొనసాగుతున్న ఘర్షణ ఫలితంగా ఈ కాల్పులు జరిగినట్లు కనిపిస్తోందని ఇజ్రాయెల్ ప్రభుత్వ యాజమాన్యంలోని కాన్ టీవీ న్యూస్ నివేదించింది.
ఇజ్రాయెల్ కు చెందిన అరబ్ పౌరులైన మూడేళ్ల బాలిక, 30 ఏళ్ల వ్యక్తిని నజరేత్ కు ఉత్తరాన ఉన్న మరో అరబ్ పట్టణం కఫ్ర్ కన్నాలో గురువారం కాల్చి చంపారు. మాగెన్ డేవిడ్ అడోమ్, పోలీసుల వాంగ్మూలాల ప్రకారం, వారు పొరపాటున కాల్పులు జరిపారు. కాల్పుల్లో వారు తీవ్రంగా గాయపడ్డారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ హత్యలను వీడియో ప్రకటనలో ఖండించారు. ఈ ఘటనలు తనను దిగ్భ్రాంతికి గురిచేశాయన్నారు. నిందితులపై తక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పారు. హింసకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవడానికి పోలీసు దళాలను బలోపేతం చేస్తామనీ, ఉగ్రవాదంపై దృష్టి సారించిన షిన్ బెట్ భద్రతా సేవను మోహరిస్తామని చెప్పారు.