ఫ్రాన్స్ లో అరుదైన భూకంపం సంభవించింది. 5.8 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం వల్ల చాలా ప్రాంతాలు వణికిపోయాయి.
ఫ్రాన్స్ : ఫ్రాన్స్ ను భారీ భూకంపం వణికించింది. 5.8 తీవ్రతతో అరుదైన భూకంపం శుక్రవారం సాయంత్రం పశ్చిమ ఫ్రాన్స్‌లోని చాలా ప్రాంతాలను తాకింది. ఈ భూకంప తీవ్రతతో భవనాలు దెబ్బతిన్నట్లు సమాచారం. అక్కడి భూకంప శాస్త్ర బ్యూరో బీసీఎస్ఎఫ్ దీనిని "చాలా బలమైన భూకంపంగా" పేర్కొంది.
పర్యావరణ మంత్రి క్రిస్టోఫ్ బెచు "ప్రధాన భూభాగంలో నమోదైన బలమైన భూకంపాలలో ఇది ఒకటి" అని అన్నారు.2000వ దశకం ప్రారంభంలో ఫ్రాన్స్‌లో ఇలాంటి శక్తివంతమైన భూకంపాలు సంభవించినట్లుగా ఏఎఫ్ పి రికార్డులు చూపిస్తున్నాయి.
పరేషాన్ చేసిన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ .. సేవలకు అంతరాయం
భూకంప నిఘా జాతీయ నెట్‌వర్క్ రెనాస్ భూకంప తీవ్రత 5.3 గా నమోదు చేసింది, ఫ్రెంచ్ సెంట్రల్ సీస్మోలాజికల్ బ్యూరో దానిని 5.8గా పేర్కొంది. ఈ భూకంపం వల్ల డ్యూక్స్ సర్వర్స్ విభాగంలో ఒక వ్యక్తి స్వల్పంగా గాయపడ్డాడు. అతనికి అక్కడికక్కడే చికిత్స అందించామని తెలిపారు.
భూకంప తీవ్రతతో అనేక డిపార్ట్ మెంట్ స్టోర్లకు భారీ నష్టం కలిగింది. రాళ్లు పడిపోవడం, గోడలు పగుళ్లు బారడం.. విద్యుత్ లైన్ లు తెగిపోవడంతో 1,100 ఇళ్లు చీకటిలో ఉండిపోయాయి. భూకంపం ఉత్తరాన రెన్నెస్, నైరుతిలో బోర్డియక్స్ వరకు చాలా దూరం వరకు ప్రభావాన్ని చూపించింది.
ఫ్రాన్స్‌లో ఐదు కంటే ఎక్కువ తీవ్రతతో భూకంపాలు చాలా అరుదు, అలాంటి అరుదైన భూకంపం చివరి సారిగా 2019లో డ్రోమ్‌లోని ఆగ్నేయ విభాగంలో నమోదైంది.
