పరేషాన్ చేసిన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ .. సేవలకు అంతరాయం

సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్, మెసేజింగ్ యాప్స్ వాట్సాప్‌ (WhatsApp),ఫేస్‌బుక్( facebook), ఇన్‌స్టాగ్రామ్ (instagram)సేవలకు శుక్రవారం (జూన్ 16) తీవ్ర అంతరాయం ఏర్పడింది. మూడు సోషల్ మీడియా సైట్‌లతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని మధ్యాహ్నం 3 గంటలకు ET/8pm BSTకి నివేదికలు వచ్చాయి. ఈ  అంతరాయం తరువాత ప్రపంచవ్యాప్తంగా మారింది.

instagram facebook whatsapp down updates KRJ

పాపులర్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్, మెసేజింగ్ యాప్స్ వాట్సాప్‌ (WhatsApp),ఫేస్‌బుక్( facebook), ఇన్‌స్టాగ్రామ్ (instagram)సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా   శుక్రవారం (జూన్ 16) సుమారు మధ్యాహ్నం 3 గంటలకు ET/8pm BSTగంటలకి  ఈ సమస్య మొదలైంది. లక్షలాది మంది యూజర్లు ఈ విషయంపై ఫిర్యాదులు చేశారు. చాలా సేపు వాట్సాప్‌లో మెసేజ్‌లు సెండ్ అవలేదు, రిసీవ్ కాలేదు. ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు మెసేజ్‌లు పంపడానికి ఇబ్బంది పడుతున్నామని , వాట్సాప్‌లో ఉన్నవారు ఫోటోలు లోడ్ చేయడం లేదని ఫిర్యాదు చేశారు.

అలాగే వెబ్‌సైట్ లోగోలను మాత్రమే చూపుతోందని , పూర్తిగా లోడ్ కావడం లేదని ఫేస్‌బుక్ వినియోగదారులు తెలిపారు . మెటా ప్రతినిధి ది సన్‌తో ఇలా అన్నారు: "కొంతమంది వ్యక్తులు మా ఉత్పత్తులను యాక్సెస్ చేయడంలో సమస్య ఎదుర్కొంటున్నారని మాకు తెలుసు. వీలైనంత త్వరగా విషయాలను సాధారణ స్థితికి తీసుకురావడానికి మేము కృషి చేస్తున్నాము. ఏదైనా అసౌకర్యానికి మేము క్షమాపణలు కోరుతున్నాము." అని పేర్కొన్నారు.   

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios