ఉత్తర నైజీరియా: ఉత్తర నైజీరియాలోని నసర్వా లోఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పెట్రోల్‌ బంక్‌లో ప్రమాదశాత్తూ గ్యాస్‌ ట్యాంకర్‌ పేలడంతో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా గాయాల పాలయ్యారు. అబుజాలోని లఫియా, మాకుర్ది మార్గంలో ఉన్న ఓ పెట్రోల్ బంక్‌ వద్ద ప్రమాదవశాత్తూ గ్యాస్‌ ట్యాంకర్‌లో మంటలు చెలరేగడంతో భారీ పేలుడు చోటుచేసుకుంది.

ట్యాంకర్‌లో నుంచి గ్యాస్‌ను బంక్‌లోకి సరఫరా చేసే సమయంలో పేలుడు చోటు చేసుకున్నట్టు ప్రత్యక్ష సాక్ష్యులు చెప్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

మరోవైపు నైజీరియాలో రోడ్డు ప్రమాదాలు తీవ్రంగా జరుగుతుండటంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదాలు సంభవిస్తున్నాయని వాపోయారు. ఈ ఏడాది జూన్ నెలలో నైజీరియా కమర్షియల్ క్యాపిటల్ సిటీగా పేరొందిన లాగోస్ లో కూడా పెట్రోల్ ట్యాంకర్ పేలింది. 

ఈ దుర్ఘటనలో 9 మంది మృత్యువాత పడగా 55 వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఆ ఘటన మరువకముందే మళ్లీ ఘోర ప్రమాదం సంభవించడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.