యెమన్: సౌదీ నేతృత్వంలోని దళాలు యెమెన్ పై విమానాలతో దాడికి దిగాయి. జెట్ విమానాన్ని కూల్చడంతో 31 మంది పౌరులు మృతి చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఐక్యరాజ్యసమితి కూడ ఈ విషయాన్ని ధృవీకరించింది.

హౌతీ తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉన్న పలు సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడి చేశారు. ఈ ఘటన జరగడానికి ముందు రోజే యెమెన్ లో సౌదీకి చెందిన జెట్ విమానం కూలిపోయింది.

ఈ విమానాన్ని తామే కూల్చి వేసినట్టుగా హౌతి తిరుగుబాటుదారులు ప్రకటించారరు. ఈ నేపథ్యంలోనే దాడులు జరిగాయని భావిస్తున్నారు. ఈ దాడుల  గురించి సౌదీ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.