అమెరికాలో మరోసారి తుపాకులు గర్జించాయి. ఇల్లినాయిస్‌‌లో శనివారం ఓ దుండగుడు తుపాకీతో రెచ్చిపోయాడు. క్రీడా మైదానంలోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ముగ్గురు వ్యక్తులు చనిపోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి ఒక అనుమాతుడిని అదుపులోకి తీసుకున్నారు.

దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని, ఘటన జరిగిన డాన్‌ కార్టర్‌ క్రీడా మైదానానికి సమీపంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాక్‌ఫోర్డ్‌ సిటీ పోలీసులు విజ్ఞప్తి చేశారు.