9/11 ఉగ్రవాది.. 22 ఏళ్ల తరువాత ఇద్దరి అవశేషాల గుర్తింపు..
అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై సెప్టెంబర్ 11న జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు బాధితులను గుర్తించారు. ఈ దాడి జరిగి 22 యేండ్లు గడుస్తున్న అవశేషాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది.
అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై (2001 సెప్టెంబర్ 11 న) ఉగ్రవాద దాడులు జరిగి ఇరవై రెండు సంవత్సరాలు అవుతోంది. ఆ రోజు జరిగిన ఉగ్రదాడుల్లో 2,977 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే.. ఆ విద్వంసం జరిగి రెండు దశాబ్దాలు దాటినా.. నేటీకి కూడా ఆ శవాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తుల అవశేషాలు DNA విశ్లేషణ ద్వారా గుర్తించబడినట్టు అధికారులు వెల్లడించారు.
న్యూయార్క్ మేయర్ కార్యాలయ ప్రకటన ప్రకారం.. ఇద్దరి కుటుంబీకుల అభ్యర్థన మేరకు ఒక పురుషుడు, ఒక మహిళ శవాన్ని గుర్తించామని అన్నారు. వీరిద్దరి అవశేషాలను అధునాతన డీఎన్‌ఏ పరీక్ష ద్వారా గుర్తించారు. సెప్టెంబరు 2021 తర్వాత బాధితురాలిని గుర్తించడం ఇదే తొలిసారి. రెండు దశాబ్దాల తర్వాత.. ఈ గుర్తింపులను రూపొందించడానికి ఉపయోగించిన సాంకేతికతల్లో ఇటీవలే స్వీకరించబడిన అడ్వాన్స్ సీక్వెన్సింగ్ సాంకేతికత కూడా ఉంది. ఇది సాంప్రదాయ DNA పద్ధతుల కంటే చాలా సున్నితమైనది. వేగవంతమైనది. తప్పిపోయిన సైనికుల అవశేషాలను గుర్తించడానికి US సైన్యం కూడా దీనిని ఉపయోగిస్తుంది.
ఇంకా 40 శాతం అవశేషాలను గుర్తించాల్సి ఉంది
DNA సాంకేతికతలో ఈ పురోగతులు ఉన్నప్పటికీ.. 9/11 దాడుల బాధితుల్లో దాదాపు 40% మంది లేదా దాదాపు 1,100 మంది వ్యక్తులు ఇప్పటికీ గుర్తించబడలేదు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై దాడి తర్వాత దిగువ మాన్‌హాటన్‌లో మొత్తం 2,753 మంది తప్పిపోయినట్లు నివేదించబడింది. మొత్తం 2,753 మందికి మరణ ధృవీకరణ పత్రాలు జారీ చేయబడ్డాయి. అయినప్పటికీ బాధితుల పేర్లను సైట్‌లోని అవశేషాలకు సరిపోల్చే ప్రక్రియ కొనసాగుతోంది.